Nirmal: ఆస్తి పన్ను కట్టలేదని.. నిర్మల్‌లో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి తాళం

నిర్మల్‌లో ఆస్తి పన్ను బకాయిల చెల్లింపుల్లో ఉదాసీనత వద్దని జిల్లా పాలనాధికారి ఆశీస్‌ సాంఘ్వాన్‌ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.

Updated : 11 Jan 2024 12:26 IST

నిర్మల్‌ టౌన్‌: నిర్మల్‌లో ఆస్తి పన్ను బకాయిల చెల్లింపుల్లో ఉదాసీనత వద్దని జిల్లా పాలనాధికారి ఆశీస్‌ సాంఘ్వాన్‌ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్న వారిపై మున్సిపల్ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అద్దె భవనంలో నిర్వహిస్తున్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ ఆస్తి పన్ను రూ.లక్షకు పైగా ఉండటంతో నోటీసులు జారీ చేశారు. యజమాని స్పందించకపోవడంతో గురువారం ఉదయం కార్యాలయాన్ని.. ఇతర దుకాణాలను సీజ్‌ చేశారు. దీంతో సబ్ రిజిస్ట్రార్‌ కిరణ్‌కుమార్‌, సిబ్బంది, వినియోగదారులు కార్యాలయం ఎదుట రెండు గంటల పాటు వేచి ఉన్నారు. తర్వాత వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా తలుపులు తెరిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని