TTD: 24న రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల: తితిదే

2024 ఫిబ్రవరి నెలకు సంబంధించి రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబరు 24న ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు తితిదే గురువారం తెలిపింది.

Updated : 23 Nov 2023 17:39 IST

తిరుమల: 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబరు 24న ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు తితిదే గురువారం తెలిపింది. తిరుమల, తిరుపతిలో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో ముందస్తుగా దర్శన టికెట్లు, గ‌దుల‌ను బుక్‌ చేసుకోవాలని తితిదే అధికారులు విజ్ఞప్తి చేశారు.

న‌వంబ‌రు 27న శ్రీ‌వారి సేవ టికెట్లు విడుద‌ల‌

2024 ఫిబ్రవరి 16న రథసప్తమి పర్వదినానికి సంబంధించి శ్రీవారి సేవ స్లాట్లను నవంబరు 27న ఉదయం 10గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. 18 నుంచి 50 ఏళ్ల వరకు వయోపరిమితి ఉన్నవారు మాత్రమే ఈ స్లాట్లను బుక్‌ చేసుకునేందుకు అర్హులు. తిరుమల, తిరుపతిలో భక్తులు స్వచ్ఛందసేవ చేసేందుకు జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి శ్రీవారి సేవ, నవనీత సేవ కోటాను నవంబరు 27న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారు. అదేరోజు మధ్యాహ్నం 3గంటలకు పరకామణి సేవ కోటాను తితిదే విడుదల చేయనుంది. ఈ సేవ‌ల‌ను www.tirumala.org వెబ్‌సైట్‌లో భ‌క్తులు బుక్ చేసుకోవ‌చ్చని తితిదే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు