Samatha Murthy: రామానుజుల స్వర్ణమూర్తిని లోకార్పణం చేసిన రాష్ట్రపతి

సమతా మూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ దంపతులు ముచ్చింతల్‌లోని

Updated : 13 Feb 2022 17:10 IST

హైదరాబాద్‌: సమతా మూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ దంపతులు ముచ్చింతల్‌లోని సమతాస్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి దంపతులకు చినజీయర్‌ స్వామి స్వాగతం పలికారు. రామానాజాచార్యుల 120 ఏళ్ల జీవితానికి గుర్తుగా 120 కిలోల బంగారంతో భద్రవేదిలోని మొదటి అంతస్తులో కొలువైన రామానుజుల స్వర్ణమూర్తిని రాష్ట్రపతి లోకార్పణం చేశారు. సమతాస్ఫూర్తి కేంద్రంలో శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం శ్రీరామనగరంలోని 108 దివ్యదేశాలను రాష్ట్రపతి దంపతులు దర్శించుకున్నారు. సమతాస్ఫూర్తి కేంద్రం విశేషాలను చినజీయర్‌ స్వామి రాష్ట్రపతికి వివరించారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జూపల్లి రామేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని