VandeBharat: తిరుపతి -సికింద్రాబాద్‌ వందేభారత్‌ రైలులో పొగలు

తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ రైలులో పొగలు రావడంతో బుధవారం సాయంత్రం నెల్లూరు జిల్లా మనుబోలు రెల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. 

Updated : 09 Aug 2023 19:26 IST

మనుబోలు: తిరుపతి-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైలులో పొగలు రావడంతో బుధవారం సాయంత్రం నెల్లూరు జిల్లా మనుబోలు రెల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ వస్తున్న వందేభారత్‌ రైలు మనుబోలు సమీపంలోకి రాగానే పొగలు రావడం గుర్తించిన సిబ్బంది వాకీటాకీ ద్వారా లోకో పైలట్‌కు సమాచారం ఇచ్చారు. రైలును మనుబోలు స్టేషన్‌లో నిలిపి వేయడంతో అప్పటికే భయాందోళనలో ఉన్న ప్రయాణికులు బోగీల నుంచి కిందకు దిగేశారు.

మూడో బోగీలోని బాత్‌రూమ్‌ నుంచి పొగలు రావడంతో సిబ్బంది వెళ్లి పరిశీలించారు. బాత్‌రూమ్‌లో కాల్చి పడేసిన సిగరెట్ ముక్క ప్లాస్టిక్‌ సామగ్రికి అంటుకోవడం వల్లే పొగ వ్యాపించిందని నిర్ధరించారు. ఈ ఘటనకు బాధ్యుడైన టికెట్‌ లేని ప్రయాణికుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేసి రైలును పంపివేశారు. దీంతో అరగంటకుపైగా రైలు నిలిచిపోయింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని