TTD: 18 నుంచి అందుబాటులోకి ఏప్రిల్‌ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

శ్రీవారి భక్తుల సౌకర్యార్థం 2024 ఏప్రిల్‌ నెలకు సంబంధించి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటా వివరాలను తితిదే బుధవారం ప్రకటించింది.

Updated : 17 Jan 2024 19:02 IST

తిరుమల: శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఏప్రిల్‌ నెలకు సంబంధించి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటా వివరాలను తితిదే బుధవారం ప్రకటించింది.

సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాద పద్మారాధన సేవల ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ కోసం జనవరి 18న ఉదయం 10గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు 22న మధ్యాహ్నం 12గంటల్లోగా రుసుము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

  • కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను జనవరి 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. 
  • వర్చువల్‌ సేవా టికెట్లను జనవరి 22న మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేస్తారు.
  • శ్రీవారి వార్షిక వసంతోత్సవం ఏప్రిల్‌ 21 నుంచి 23 వరకు జరగనుంది. ఇందుకు సంబంధించిన సేవా టికెట్లను 22వ తేదీ ఉదయం 10గంటలకు విడుదల చేస్తారు.
  • అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23వ తేదీ ఉదయం 10గంటలకు విడుదల చేస్తారు.
  • శ్రీవాణి ట్రస్ట్‌ బ్రేక్‌ దర్శనం, గదుల కోటాను 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.
  • వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేస్తారు.
  • ప్రత్యేక ప్రవేశదర్శనం రూ.300 టికెట్ల కోటాను 24న ఉదయం 10గంటలకు విడుదల చేస్తారు.
  • తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్‌ జనవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.      
  • ఏప్రిల్‌ నెలకు సంబంధించి జనవరి 27న ఉదయం 11గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను, మధ్యాహ్నం 12గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం ఒంటిగంటకు పరకామణి సేవ కోటాను విడుదల చేస్తారు.    
  • భక్తులు వెబ్‌సైట్‌ https://tirupatibalaji.ap.gov.in  ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్‌ చేసుకోవాలని తితిదే కోరింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని