క్రిమిసంహారక టన్నెళ్ల వినియోగంపై కేంద్రానికి నోటీసులు

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఏర్పాటు చేస్తున్న క్రిమిసంహారక సొరంగాలకు(క్రిమిసంహారక టన్నెళ్లు) వ్యతిరేకంగా దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. వాటి నిషేధంపై స్పందించాలని పేర్కొంది.

Published : 12 Aug 2020 20:13 IST

దిల్లీ: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఏర్పాటు చేస్తున్న క్రిమిసంహారక టన్నెళ్లకు వ్యతిరేకంగా దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. వాటి నిషేధంపై స్పందించాలని పేర్కొంది. క్రిమిసంహారక టన్నెళ్ల వాడకం, ఉత్పత్తి, ప్రచారాన్ని తక్షణమే నిషేధించాలని ఓ న్యాయ విద్యార్థి పిల్‌ వేయగా జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, సాంకేతిక శాఖ, వ్యవసాయ శాఖలకు నోటీసులు జారీ చేసింది.

క్రిమిసంహారకం పేరుతో మనుషులపై పురుగుమందులు చల్లడం నిషేధించాలని పిటిషనర్‌ కోరారు. కరోనా నేపథ్యంలో అనేక రకాల క్రిమిసంహారక పరికరాలు మార్కెట్లో లభిస్తున్నాయని, అవి వైరస్‌ను కట్టడి చేస్తాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఎలాంటి తనిఖీలూ లేని, తప్పడు సమాచారంతో వినియోగిస్తున్న ఇలాంటి క్రిమిసంహారక టన్నెళ్ల  వల్ల మనుషుల్లో భౌతికంగా, మానసికంగా అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వైద్య నిపుణులు హెచ్చరించినట్లు పిటిషనర్ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని