TS News: రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా తెలంగాణ: గవర్నర్‌ తమిళిసై

ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనదని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అన్నారు.

Updated : 25 Jan 2024 12:17 IST

హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనదని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అన్నారు. హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన ఆమె.. అత్యుత్తమ రాజ్యాంగం అందించిన దార్శనికులకు నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌ మెడికల్‌ హబ్‌గా ఎదగడం సంతోషకరమని గవర్నర్‌ చెప్పారు. రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా తెలంగాణ ఎదిగిందన్న ఆమె.. రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలిపిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అంబులెన్స్‌ డ్రైవర్స్‌, పారిశుద్ధ్య కార్మికులతో గవర్నర్‌ కాసేపు ముచ్చటించారు. అంతకముందు గణతంత్ర వేడుకల సందర్భంగా పరేడ్‌ మైదానంలోని యుద్ధ వీరుల స్తూపం వద్ద తమిళిసై నివాళులు అర్పించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని