Telangana CS review on Rains: ప్రాణ, ఆస్తి నష్టం ఉండొద్దు: సీఎస్

భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా యుద్ధప్రాతిపదికన తగిన సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులను

Updated : 22 Jul 2021 16:22 IST

హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా యుద్ధప్రాతిపదికన తగిన సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ ఆదేశించారు. గోదావరి పరివాహక పరిధిలోని 16 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీ మహేందర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు టెలీకాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని... అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని, చెరువులకు ఎలాంటి గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందిస్తామన్న సీఎస్... విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బొజ్జాకు వివరాలు అందించాలని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని