Tirumala Tirupati Devasthanams: తిరుమలలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు

తిరుమలలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కృష్ణాష్టమి సందర్భంగా గోగర్భం వద్ద కాళీయమర్దనుడికి అర్చకులు అభిషేకం చేశారు..

Updated : 30 Aug 2021 17:17 IST

తిరుపతి: తిరుమలలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కృష్ణాష్టమి సందర్భంగా గోగర్భం వద్ద కాళీయమర్దనుడికి అర్చకులు అభిషేకం చేశారు. గోగర్భం వద్ద యువకులు ఉట్టి కొట్టారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర గోసంరక్షణశాలలో నిర్వహించిన గోకులాష్టమి గోపూజా కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో జవహర్ రెడ్డితో కలిసి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. గోశాలలోని వేణుగోపాలస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోమాత, దూడకు నూతన వస్త్రాలు, పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు నిత్యాన్నదానం నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. కృష్ణాష్టమి రోజున శ్రీవారికి నవనీత సేవ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గోపూజ విశేష ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతోనే తితిదే పరిధిలోని వంద ఆలయాల్లో ‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. గోఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులతో శ్రీవారికి నిత్యం సమర్పించే ప్రసాదాలను తయారు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అసత్య ఆరోపణలతో దుష్ప్రచారం చేసే వారిపై కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని