Telangana government: పదోన్నతుల అంశంపై ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు

పదోన్నతుల అంశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులకు కనీస సర్వీసును రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లకు

Updated : 30 Aug 2021 21:58 IST

హైదరాబాద్‌: పదోన్నతుల అంశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులకు కనీస సర్వీసును రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లకు కుదించింది. పదోన్నతి కోసం ఇప్పటివరకు మూడేళ్ల కనీస సర్వీసు ఉండాలనే నిబంధన అమల్లో ఉంది. 2020-21 ప్యానల్ సంవత్సరానికి కనీస సర్వీసును రెండేళ్లకు కుదిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ తగ్గింపు మిగతా సంవత్సరాలకు కూడా వర్తించాలని, లేదంటే చాలా మంది ఉద్యోగులు నష్టపోతారని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో ప్యానెల్ సంవత్సరాలకు సంబంధం లేకుండా కనీస సర్వీసును రెండేళ్లకు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీపీసీ నిర్వహించే సమయానికి రెండేళ్ల కనీస సర్వీసు ఉంటే పదోన్నతులకు అర్హులన్న ప్రభుత్వం.. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు