10th class result 2022: ఏపీలో పదో తరగతి ఫలితాల విడుదల వాయిదా

ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల వాయిదా పడింది. ఫలితాలను సోమవారానికి వాయిదా

Updated : 06 Jun 2022 12:34 IST

అమరావతి: ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల (10th class result 2022) వాయిదా పడింది. ఫలితాలను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తామని చెప్పారు. సాంకేతిక కారణాలతో వాయిదా వేయాల్సి వచ్చిందని వారు తెలిపారు.

ముందు ప్రకటించిన విధంగా ఈ ఉదయం 11 గంటలకు ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. వీటి కోసం రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురు చూశారు. ఈ క్రమంలో మీడియా సమావేశానికి రావాల్సిన అధికారులు ఆలస్యమైనా రాకపోవడంతో ఫలితాల వెల్లడిపై సందిగ్ధం ఏర్పడింది. కాసేపటికే ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

సమన్వయ లోపమే కారణమా?

పదో తరగతి ఫలితాల విడుదల వాయిదాలో మంత్రి బొత్స, విద్యాశాఖ అధికారుల మధ్య సమన్వయ లోపమే కారణంగా తెలుస్తోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది. అయితే విద్యాశాఖ మంత్రి బొత్స అందుబాటులో లేకపోవడంతో ఫలితాలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీనిపట్ల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త మంత్రివర్గ కూర్పు తర్వాత ప్రకటిస్తున్న తొలి ఫలితాలు ఇలా వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని