Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 14 Jan 2022 13:19 IST

1. IND vs SA: టీమ్‌ఇండియా ఒత్తిడికి గురువుతోంది.. అందుకే అలా: ఎంగిడి

దక్షిణాఫ్రికాలో తొలిసారి టెస్టు సిరీస్‌ కైవసం చేసుకోవాలని ఆశిస్తున్న టీమ్‌ఇండియాకు శుక్రవారం అసలు పరీక్ష ఎదురుకానుంది. ఇప్పటికే సఫారీల జట్టు  212 పరుగుల లక్ష్య ఛేదనలో 101/2 స్కోర్‌తో నిలకడగా ఆడుతోంది. క్రీజులో కీగన్‌ పీటర్సన్‌ (48) ఉన్నాడు. ఆ జట్టు విజయానికి ఇంకా 111 పరుగులే అవసరం ఉంది. కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ (30) గురువారం ఆటముగిసే ముందు వికెట్‌ కీపర్‌కు చిక్కడంతో కోహ్లీసేనకు కీలక వికెట్‌ లభించి కాస్త ఊరటనిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Bhogi celebrations: తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సందడి

తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. ఇంటి ముంగిళ్లలో రంగవల్లులు.. వీధి వీధిన భోగిమంటలతో సంక్రాంతి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఎక్కడ చూసినా భోగిమంటలతో.. ఇళ్ల ముందు రంగురంగుల రంగవల్లులు వేస్తూ చిన్న పెద్ద అందరూ సందడి చేస్తున్నారు. భోగి భోగభాగ్యాలు కలిగించాలని, ఏడాడంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ భోగిమంటల వేసుకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. India Corona: అదే ఉద్ధృతి.. కొత్తగా 2.64 లక్షల కేసులు

 దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. తాజాగా 2,64,202 మందికి కరోనా సోకింది. ముందురోజు కంటే 6.7 శాతం అదనంగా కేసులు వెలుగుచూశాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 14.78 శాతానికి చేరింది. నిన్న 17 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో మహమ్మారి విజృంభణకు దోహదం చేస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు 5,753కి పెరిగాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, దిల్లీ, కేరళలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Mysuru: పునాది లేకుండానే ఇంటి నిర్మాణం.. ఖర్చు 40% తక్కువే!

ఇంటిని నిర్మించాలంటే ముందుగా పునాది సిద్ధం చేయాలి. కానీ కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన ఓ ఆర్కిటెక్ట్‌ అసలు పునాదే లేకుండా ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. అందుకోసం మూడు సరికొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. ఇప్పటికే రెండు ఇళ్లను నిర్మించి.. అందరి మన్ననలు పొందుతున్నారు. అతడే ఆర్కిటెక్ట్‌ శరత్‌ కుమార్‌. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా తక్కువ ధరలో, తక్కువ సమయంలో పునాది లేకుండానే ఇంటి నిర్మాణం చేపట్టొచ్చని చెబుతున్నారు. ఈ సాంకేతికతను అడ్వాన్స్‌డ్‌ రాపిడ్‌ కన్‌స్ట్రక్షన్‌గా పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వైకాపా నేతలు, సినిమా వాళ్లు పరస్పరం దూషించుకోవడం సరికాదు: రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, సినిమాటోగ్రఫీ మంత్రి కలిసి అసోసియేషన్లతో చర్చలు జరిపి సినిమా టిక్కెట్‌ రేట్ల వివాదానికి పరిష్కారం చూపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. వైకాపా నేతలు, సినిమా వాళ్లు పరస్పరం దూషించుకోవడం సరికాదన్నారు. వ్యక్తులతో విడివిడిగా కాకుండా మూవీ ఆర్టిస్ట్స్, డైరెక్టర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్లు, థియేటర్ల యాజమాన్యాలతో చర్చలు జరిపితేనే ఫలితం ఉంటుందని అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Train Accident: బెంగాల్‌ రైలు ప్రమాదం ఘటన.. 9కి చేరిన మృతుల సంఖ్య

పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకున్న రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. జల్‌పాయ్‌గుడి జిల్లా దోహొమోనీ వద్ద గురువారం సాయంత్రం గువాహటి-బికనేర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పి 12 బోగీలు బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతిచెందగా.. మరో 70 మందికి పైగా గాయపడినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Crime News: ఉస్మానియా ఆస్పత్రికి జైహింద్‌ నాయక్‌ మొండెం

నల్గొండ జిల్లాలో జైహింద్‌ నాయక్‌ (30) అనే మతి స్థిమితం లేని వ్యక్తి దారుణహత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లోని ఓ భవనంపై పోలీసులు జైహింద్‌ నాయక్‌ మొండెం గుర్తించారు. మూడు రోజుల క్రితం నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నాగార్జున సాగర్‌, హైదరాబాద్‌ జాతీయ రహదారి పక్కనే విరాట్‌నగర్‌ కాలనీలో మెట్టు మహంకాళీ అమ్మవారి విగ్రహం వద్ద దుండగులు మొండెం లేని జైహింద్‌ నాయక్‌ తలను ఉంచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Bangarraju Review: రివ్యూ: బంగార్రాజు

పండ‌గలాంటి సినిమా... పండ‌గ‌కే రావాలంటూ నాగార్జున ప‌ట్టుప‌ట్టి చేసిన సినిమా ‘బంగార్రాజు’. ఆయ‌న   అనుకున్న‌ట్టే సంక్రాంతి సంద‌ర్భంగా  ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.  విజ‌య‌వంత‌మైన ‘సోగ్గాడే చిన్నినాయ‌నా’కి కొన‌సాగింపు చిత్రం కావ‌డం, తండ్రి నాగార్జున‌కి తోడుగా త‌న‌యుడు నాగ‌చైత‌న్య కూడా  చిన బంగార్రాజు పాత్ర‌లో న‌టించ‌డం,  పండ‌గ సినిమాల్లో అగ్ర తార‌లు న‌టించిన సినిమా ఇదే కావ‌డం... త‌దిత‌ర కార‌ణాల‌తో విడుద‌ల‌కి ముందే అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది?  బంగార్రాజు పాత్రల్లో తండ్రీ తనయులు చేసిన సందడి ఎలా ఉంది? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Nun Rape Case: నన్‌పై అత్యాచారం కేసు.. బిషప్‌ ఫ్రాంకో ములక్కల్‌ నిర్దోషే

మూడేళ్ల క్రితం కేరళలో కలకలం సృష్టించిన నన్‌పై అత్యాచారం కేసులో కొట్టాయం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బిషప్‌ ఫ్రాంకో ములక్కల్‌ నిర్దోషి అని ప్రకటించింది. బాధిత నన్‌పై బిషప్‌ ఫ్రాంకో లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్నదానిపై సరైన ఆధారాలు లేకపోవడంతో ఆయనపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తున్నట్లు అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు తీర్పు వెలువరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సీఎంతో చిరంజీవి భేటీ శుభపరిణామం.. తప్పకుండా న్యాయం జరుగుతుంది: రోజా

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో నటుడు చిరంజీవి భేటీ అవటం శుభపరిణామం అని సినీనటి, నగరి ఎమ్మెల్యే రోజా అభిప్రాయపడ్డారు. చిత్ర పరిశ్రమ వారు చెప్పింది న్యాయమనిపిస్తే తప్పకుండా మంచి జరుగుతుందన్నారు. బంధువులతో కలిసి సంక్రాంతి పండగ జరుపుకునేందుకు కడపలోని శెట్టిపాలెం విచ్చేసిన ఆమె సినిమా టికెట్‌ ధరల విషయంపై మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని