Bangarraju Review: రివ్యూ: బంగార్రాజు
‘బంగార్రాజు’ రివ్యూ.. నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన చిత్రం ఎలా ఉందంటే?
నటీనటులు: అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ తదితరులు. సాంకేతిక బృందం: కథ, దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ; నిర్మాత: అక్కినేని నాగార్జున; స్క్రీన్ ప్లే: సత్యానంద్ సంగీతం: అనూప్ రూబెన్స్; ఛాయాగ్రహణం: యువరాజ్; కళ: బ్రహ్మ కడలి; సంస్థ: జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి. విడుదల: 14 జనవరి 2021.
పండగ లాంటి సినిమా... పండగకే రావాలంటూ నాగార్జున పట్టుపట్టి చేసిన సినిమా ‘బంగార్రాజు’. ఆయన అనుకున్నట్టే సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. విజయవంతమైన ‘సోగ్గాడే చిన్నినాయనా’కి కొనసాగింపు చిత్రం కావడం, నాగార్జునకి తోడుగా తనయుడు నాగచైతన్య చినబంగార్రాజు పాత్రలో నటించడం, పండగ సినిమాల్లో అగ్ర తారలు నటించిన సినిమా ఇదే కావడం... లాంటి కారణాలతో విడుదలకి ముందే అందరి దృష్టినీ ఆకర్షించింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? బంగార్రాజు పాత్రల్లో తండ్రీ తనయులు చేసిన సందడి ఎలా ఉంది? తదితర విషయాలు తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం!
కథేంటంటే?
‘సోగ్గాడే చిన్నినాయనా’ కథ ముగిసిన చోట నుంచి బంగార్రాజు కథ మొదలవుతుంది. కొడుకు రాము (నాగార్జున), కోడలు (సీత)ని కలిపి వాళ్ల సమస్యని పరిష్కరించి పైకి వెళ్లిన బంగార్రాజు (నాగార్జున), ఈసారి మనవడు చిన బంగార్రాజు (నాగచైతన్య) కోసం పై నుంచి కిందకి రావల్సి వస్తుంది. అతని మనవడి కళ్యాణంతోపాటు, లోక కళ్యాణం కోసం బంగార్రాజుని కిందకి పంపిస్తాడు యమధర్మరాజు. అలా చిన బంగార్రాజులోకి ఆత్మగా దూరి అతనికి పెద బంగార్రాజు ఎలా సాయం చేశాడు? భార్య సత్యభామ (రమ్యకృష్ణ) కోరిక మేరకు చిన్న బంగార్రాజునీ, నాగలక్ష్మి (కృతిశెట్టి)నీ ఎలా కలిపాడు? చిన బంగార్రాజుని చంపాలనే కుట్రతోపాటు, ఊరి గుడిలో ఉన్న నిధులపై కన్నేసిన దుష్ట శక్తుల పన్నాగాల్ని బంగార్రాజు ఎలా తిప్పికొట్టాడన్నదే మిగతా కథ.
ఎలా ఉందంటే?
పండగ లాంటి సినిమా అని చెబుతూ వచ్చిన చిత్రబృందం అందుకు తగ్గ హంగుల్ని పక్కాగా మేళవించింది. గ్రామీణ నేపథ్యం, ఆకట్టుకునే తారాగణం, కలర్‌ఫుల్ పాటలకితోడు అభిమానుల్ని మెప్పించే అంశాల్ని జోడించి సినిమాని తీర్చిదిద్దారు. `సోగ్గాడే చిన్నినాయనా` కథకి కొనసాగింపుగా వచ్చిన చిత్రం కాబట్టి తొలి సినిమా తరహాలోనే పక్కా ఫార్ములాతో గుడికీ, బంగార్రాజు కుటుంబానికీ ముడిపెట్టి కథని అల్లుకున్నారు దర్శకుడు. తొలి సినిమాలో తనయుడి సమస్యయితే, ఇందులో మనవడి జీవితాన్ని చక్కబెడతాడు. తొలి సినిమాలో బంగార్రాజు మాత్రమే ఆత్మ, ఇందులో మాత్రం ఆయనకి సత్యభామ కూడా తోడైంది. ప్రథమార్ధం అంతా మన్మథుడుగా ముద్రపడిన చినబంగార్రాజు, ఊరి సర్పంచ్ అయిన నాగలక్ష్మి హంగామాతోనే సాగుతుంది. ఒకరంటే ఒకరికి పడని ఆ ఇద్దరూ కలిసే వైనం, పెద్ద బంగార్రాజు చేసే మేజిక్‌తో సన్నివేశాలు సరదాగా సాగిపోతాయి. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం ఆసక్తిని పెంచుతుంది. చాలా సన్నివేశాలు ఊహాజనితంగానే సాగినప్పటికీ మాస్ ప్రేక్షకుల్ని మెప్పించే అంశాల్ని పుష్కలంగా జోడించారు. మామిడి తోటలో చిన్న పిల్లాడిని కాపాడే సన్నివేశాలు, పతాక సన్నివేశాల్లో గుడి దగ్గర చోటు చేసుకునే మలుపు మాస్ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించేవే. అత్తమామలు, కోడలికి మధ్య మనస్పర్థల్ని తొలిగించే ఓ సన్నివేశంలో బంగార్రాజు చెప్పే సంభాషణలు, ఆ నేపథ్యంలో పండే భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. కొనసాగింపు చిత్రం అన్నప్పుడు తప్పకుండా ప్రేక్షకుడికి తొలి సినిమా గుర్తుకొస్తూనే ఉంటుంది. తొలి చిత్రంలో బంగార్రాజు సరసాలు చక్కటి వినోదాన్ని పంచిపెడతాయి. యువ కథానాయకుడు నాగచైతన్య ఈసారి కథలోకి వచ్చినా ఆ ప్రభావం సినిమాలో పెద్దగా కనిపించలేదు. ఆత్మల కథల్లోనూ... కమర్షియల్ కథల్లోనూ లాజిక్‌లు వెతక్కూడదు కానీ, ఇందులో కొన్ని విషయాలు మరీ నాటకీయంగా అనిపిస్తాయి. కొన్ని సన్నివేశాలు లాజిక్‌కి ఏమాత్రం అందవు.
ఎవరెలా చేశారంటే?
సోగ్గాళ్లుగా నాగార్జున, నాగచైతన్య చేసిన హంగామానే సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఆత్మగా దూరితే తప్ప సందడి చేయలేని విధంగా నాగచైతన్య పాత్రని తీర్చిదిద్దడంతో చాలా చోట్ల నాగార్జునే హైలెట్ అయ్యారు. ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. రమ్యకృష్ణ, కృతిశెట్టి పాత్రలూ ఆకట్టుకుంటాయి. నాగలక్ష్మి పాత్రపై కృతి తనదైన ముద్ర వేసింది. సంపత్ రాజ్, రావు రమేష్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, ఝాన్సీ, యముడిగా నాగబాబు తదితరులు పాత్రల పరిధి మేరకునటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. యువరాజ్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. అనూప్ పాటలు సినిమాకి ప్రధాన బలం. విజువల్‌గా కూడా పాటలు ఆకట్టుకుంటాయి. దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ రచన పరంగా తనదైన ప్రభావం చూపించారు. ముఖ్యంగా మాటల్లో చమక్కులు కనిపిస్తాయి. కథనం పరంగానే కసరత్తులు చాలలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
బలాలు
+ నాగార్జున
+ గ్రామీణ నేపథ్యం
+ పాటలు
+ అభిమానుల్ని మెప్పించే అంశాలు
బలహీనతలు
- ఊహకందే కథ, కథనాలు
- హాస్యం పండకపోవడం
చివరిగా: సంక్రాంతి సోగ్గాళ్ల సందడి
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ప్రతినిధి2.. నారా రోహిత్ పొలిటికల్ డ్రామా ఎలా ఉంది?
Prathinidhi 2 Review: నారా రోహిత్ కీలక పాత్రలో నటించిన ‘ప్రతినిధి2’ ప్రేక్షకుల మెప్పించిందా? -
రివ్యూ: ఆవేశం.. రూ.150 కోట్లు వసూలు చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ ఎలా ఉంది?
ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించిన మలయాళ సూపర్‌హిట్ మూవీ ‘ఆవేశం’ మెప్పించిందా? -
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
మమితా బైజు, అర్జున్ అశోకన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రణయ విలాసం’. ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథేంటంటే? -
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
baak movie review: ‘అరణ్మనై’ సిరీస్‌లో నాలుగో భాగంగా వచ్చిన ‘బాక్’మూవీ సినీ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
aa okkati adakku review: అల్లరి నరేష్, ఫరియా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ మెప్పించిందా. -
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
sabari movie review in telugu: వరలక్ష్మీ శరత్‌కుమార్, గణేశ్ వెంట్రామన్ కీలక పాత్రల్లో నటించిన ‘శబరి’ మెప్పించిందా? -
రివ్యూ: ప్రసన్నవదనం.. సుహాస్ ఖాతాలో హిట్ పడిందా?
సుహాస్ కీలక పాత్రలో ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్‌తో రూపొందిన థ్రిల్లర్ మూవీ ఎలా ఉంది. -
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్‌లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్‌సిరీస్ ఎలా ఉంది?
భారీ తారాగణంతో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన వెబ్‌సిరీస్ మెప్పించిందా? -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్ డ్రామా ఎలా ఉంది?
వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది? -
రివ్యూ: డియర్.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?
DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: శ్రీ రంగనీతులు.. సుహాస్, కార్తీక్ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?
sri ranga neethulu review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: బడే మియా ఛోటే మియా.. అక్షయ్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘బడే మియా ఛోటే మియా’ మెప్పించిందా? -
రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
అంజలి కీలక పాత్రలో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: లవ్‌గురు.. విజయ్ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?
Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా? -
రివ్యూ: మైదాన్.. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ మూవీ ఎలా ఉంది?
తాజా వార్తలు (Latest News)
-
మల్కాజిగిరి.. విలక్షణమే ప్రతిసారీ
-
అమరావతి కోసమే పశ్చిమ సీటు ఇచ్చేశా: పవన్ కల్యాణ్
-
కాంగ్రెస్ ప్రచారంలో అపశ్రుతి.. కారు బోల్తాపడి పార్టీ నాయకురాలి దుర్మరణం
-
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
-
అనుమానం వచ్చిందంటే..ఖాతా రద్దే
-
రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను: తండ్రికి మెసేజ్ పంపి విద్యార్థి అదృశ్యం