Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 16 Jan 2022 13:11 IST

1. Virat Kohli : నువ్వు వందశాతం కృషి చేశావు.. ఇదొక విచారకరమైన రోజు

భారత టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ వైదొలిగాడు. దీంతో అన్ని ఫార్మాట్ల సారథ్యం నుంచి కోహ్లీ తప్పుకొన్నట్లే. ఈ క్రమంలో కోహ్లీ నిర్ణయంపై మాజీలు సహా క్రీడా ప్రపంచం స్పందించింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి, దిగ్గజ క్రికెటర్ సచిన్‌ తెందూల్కర్‌, వసీం జాఫర్, జై షా తదితరులు సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. విరాట్ నిర్ణయం తననెంతో షాక్‌కు గురి చేసిందని భారత వన్డే, టీ20 జట్టు సారథి రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Vaccination Drive: ఏడాది ప్రయాణం.. ఎన్నెన్నో మైలురాళ్లు!

 కొత్త వైరస్‌.. ఫలితంగా భారీ సంఖ్యలో కేసులు.. ఊహించని స్థాయిలో మరణాలు.. దాదాపు 130 కోట్లకుపైగా జనాభా కలిగిన భారతావనిలో కరోనా కట్టడి సాధ్యమేనా..? అన్న సందిగ్ధత! ఇలాంటి పరిస్థితుల నడుమ.. గతేడాది ఇదే రోజు దేశంలో ప్రారంభమైంది వ్యాక్సినేషన్‌ ప్రక్రియ. ఏడాది తిరిగేసరికి దేశవ్యాప్తంగా దాదాపు 156 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేయడం విశేషం. ప్రజలను కరోనా ముప్పు నుంచి కాపాడటంలో వ్యాక్సిన్‌లది కీలక పాత్ర అని చెబుతూ వస్తోన్న డబ్ల్యూహెచ్‌వో, ఇతర వైద్య నిపుణుల సూచనలతో.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Acharya: మెగా అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ‘ఆచార్య’ రిలీజ్‌ఎప్పుడంటే..!

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 4 విడుదల కావాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం శనివారం ప్రకటించింది. దీంతో నిరూత్సహ పడ్డ మెగా అభిమానులకు నేడు చిత్రయూనిట్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. సోషల్‌మీడియా వేదికగా ‘ఆచార్య’ కొత్త రిలీజ్‌ డేట్‌ని వెల్లడించింది. ఉగాది సందర్భంగా ఏప్రిల్‌ 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Telugu movies: ఈ ఏడాది అలరించే సీక్వెల్స్‌ ఇవే!

4. కొవిడ్‌ ఎఫెక్ట్‌.. తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు

తెలంగాణలోని విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సెలవులు పొడిగించాలని విద్యాశాఖకు వైద్యారోగ్య శాఖ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ సిఫార్సు మేరకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Balakrishna: సతీమణి వసుంధరతో వాడరేవు బీచ్‌లో బాలయ్య సందడి

సంక్రాంతి అంటే వెండితెరపై సందడి చేసే నందమూరి బాలకృష్ణ ఈసారి తన సోదరి పురందేశ్వరి ఇంట్లో వేడుక చేసుకున్నారు. కుటుంబ సమేతంగా ప్రకాశం జిల్లా కారంచేడు వెళ్లిన ఆయన గత రెండు రోజులుగా అక్కడే సందడిగా గడుపుతున్నారు. బంధువులతో కలిసి చీరాలలోని వాడరేవు బీచ్‌కు వెళ్లి.. కుటుంబసభ్యులతో ఆహ్లాదంగా గడిపారు. ఈ సందర్భంగా బాలయ్య తన సతీమణి వసుంధరను జీప్‌లో ఎక్కించుకొని సరదాగా బీచ్‌లో రైడింగ్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Volcano: సముద్ర గర్భంలో పేలిన అగ్నిపర్వతం.. పలు దేశాలకు సునామీ హెచ్చరికలు!

దక్షిణ పసిఫిక్‌ సముద్రంలోని ద్వీపకల్పం టోంగా సమీపంలో భారీ అగ్నిపర్వతం బద్దలైంది. టోంగా రాజధాని నుకులోఫాలోకి 65కి.మీ దూరంలో సముద్ర గర్భంలో ఉన్న అగ్ని పర్వతం(టోంగా హుంగా హాపై) శనివారం ఒక్కసారిగా బద్ధలవడంతో టోంగా వ్యాప్తంగా పొగ, బూడిద ఎగిసిపడ్డాయి. సముద్ర గర్భం నుంచి బయటకొచ్చిన బూడిద 20కి.మీ వరకు ఎగిసిపడ్డట్లు టోంగా జియోలాజికల్‌ సర్వే సంస్థ తెలిపింది. అగ్నిపర్వతం పేలుడు శబ్దాలు 8 నిమిషాలపాటు వినిపించినట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సికింద్రాబాద్‌ క్లబ్‌.. సకల సౌకర్యాల వనం.. దీని చరిత్ర ఘనం!

7. Road Accidents: రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి.. ఆరుగురికి గాయాలు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలకు సంబంధించి చౌటుప్పల్‌ సీఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్‌ మండలం ధర్మోజీగూడెంలో ఆదివారం ఉదయం ఓ కారు, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌ జవహర్‌నగర్‌కు చెందిన చందు(35), ఆసిఫ్‌నగర్‌కు చెందిన సాయి పృథ్వీరాజ్‌(23) అక్కడికక్కడే మృతిచెందారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చూపునకు చక్కెర చేటు..చక్కెర కాదది.. కంటికి కారం!

మధుమేహం.. ఓ సమస్యల సుడిగుండం. ఇంకా చెప్పాలంటే.. పైకి కనబడకుండా చాప కింద నీరులా విస్తరిస్తూ ఒళ్లంతా కబళించే ఉపద్రవం! మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే అది గుండె నుంచి కిడ్నీల వరకూ.. కాళ్ల నుంచి కళ్ల వరకూ.. శరీరమంతా దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. మధుమేహులకు గుండె పోటు, పక్షవాతం, కిడ్నీలు దెబ్బతినటం, కాళ్ల మీద పుళ్లు పడి మానకపోవటం వంటి ముప్పులు చాలా ఎక్కువన్న విషయం ఇప్పుడు అందరికీ బాగానే తెలుసు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. India Corona: కొత్తగా 2.71 లక్షల కేసులు.. స్వల్పంగా తగ్గిన పాజిటివిటీ రేటు

భారత్‌లో రెండు రోజులుగా కొత్త కొవిడ్‌ కేసుల్లో స్వల్పపాటి పెరుగుదల నమోదవుతోంది. తాజాగా 2,71,202 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నిన్న 16.65 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా.. ఈ మేరకు కేసులు బయటపడ్డాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల వ్యవధిలో 314 మంది మృతి చెందారని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు నిన్నటితో పోల్చితే స్వల్పంగా తగ్గి 16.28 శాతానికి చేరింది. వీక్లీ పాజిటివిటీ రేటు 13.69గా నమోదైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* మాస్కుతో పోయేదానికి.. ఆసుపత్రి దాకా ఎందుకు మావా?!

10. పాక్‌ ఉగ్రవాది విడుదల కోసం అమెరికాలో దుండగుడి 10గంటల వీరంగం

తుపాకి సహా పేలుడు పదార్థాలు కలిగిన ఓ దుండగుడు శనివారం యావత్‌ అమెరికాను తీవ్ర భయాందోళనకు గురిచేశాడు. నలుగురు వ్యక్తులను బందీలుగా చేసుకొని దాదాపు పది గంటల పాటు వీరంగం సృష్టించాడు. స్థానిక పోలీసులు, అమెరికా ప్రత్యేక దళాలు దుండగుడిని హతమార్చడంతో ఎట్టకేలకు పరిస్థితి సుఖాంతం అయ్యింది. బందీలు సురక్షితంగా బయటకు రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ముష్కరుడు వారికి ఎలాంటి హాని తలపెట్టకపోవడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని