Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్.. లావాదేవీలపై సిట్ ఆరా
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఆరు రోజుల కస్టడీలో భాగంగా ఐదో రోజు నిందితులను సిట్ అధికారులు విచారిస్తున్నారు. నిందితులు రాజశేఖర్‌రెడ్డి, ప్రవీణ్, రేణుక దంపతుల బ్యాంక్ స్టేట్‌మెంట్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. గత కొంతకాలంగా జరిగిన లావాదేవీలపై సిట్ బృందం ఆరా తీస్తోంది. మంగళవారం ఏపీపీఎస్సీలోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్ సూపరింటెండెంట్ శంకరలక్ష్మి నుంచి మరికొన్ని వివరాలు సేకరించిన సిట్.. ఆమె చెప్పిన వివరాలతో నేడు ప్రవీణ్‌ణు విచారిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ఉగాది జోష్ పెంచిన బాలయ్య.. కొత్త సినిమా పోస్టర్లతో టాలీవుడ్‌లో సందడి..
తెలుగు సినీ రంగంలో ఉగాది పోస్టర్ల సందడి నెలకొంది. పండగ వచ్చిందంటే సినీ ప్రియులు.. అభిమాన తారల సినిమా అప్‌డేట్స్ కోసం ఎదరుచూస్తుంటారు. అందుకు తగ్గట్లుగానే ఉగాది సందర్భంగా కొత్త సినిమా కబుర్లతో సోషల్‌మీడియా కళకళలాడుతోంది. కొన్ని సినిమాలు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి పండగ తీసుకురాగా.. మరికొన్ని పోస్టర్లతో, ట్రైలర్‌లతో అలరించాయి. ‘ఈ సారి మీ ఊహలకు మించి’ అంటూ బాలకృష్ణ తన కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయగా.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. మన దగ్గరా అలాగే సమాధానం ఇవ్వాలేమో?: కేటీఆర్
భాజపా పాలిత రాష్ట్రాల్లో పరుష పదాలతో ట్వీట్ చేసిన వారిని అరెస్ట్ చేస్తున్నారని.. తెలంగాణ మాత్రం ఏకంగా సీఎం, మంత్రులను దుర్భాషలాడుతూ అవమానకరంగా మాట్లాడుతున్నా సహిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పరుష పదాలతో ట్వీట్ చేసినందుకు భాజపా పాలిత రాష్ట్రం కర్ణాటకలో కన్నడ నటుడు చేతన్‌ను అరెస్ట్ చేసిన విషయాన్ని కేటీఆర్ తన ట్విటర్‌లో ప్రస్తావించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. రోహిత్-కోహ్లీ’ మరో రెండు పరుగులు చేస్తే.. ప్రపంచ రికార్డే
భారత్-ఆస్ట్రేలియా(IND vs AUS)ల మధ్య సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే నేడు చెన్నైలో జరగనుంది. తొలి వన్డేలో గెలిచి.. రెండో వన్డేలో అన్ని విభాగాల్లో విఫలమై చిత్తుగా ఓడిన రోహిత్ సేనకు కీలక పోరు ఇది. అయితే.. ఈ సిరీస్‌లో పెద్దగా రాణించని రోహిత్-కోహ్లీ (Rohit Sharma-Virat Kohli)ల ముందు ఓ ప్రపంచ రికార్డు వేచి ఉంది. వీరిద్దరూ కలిసి మరో 2 పరుగులు చేస్తే.. వన్డేల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన జంట(fastest pair)గా నిలవనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ‘నా కథను అందరితో పంచుకుంటా..’ కన్నీళ్లతో ఉన్న ఫొటో షేర్ చేసిన మృణాల్
సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫొటో అభిమానులను కలవరపాటుకు గురి చేస్తోంది. ‘మేడమ్ మీకు ఏమైంది?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుస సినిమా షూట్స్‌తో బిజీగా ఉంటోన్న మృణాల్ (Mrunal Thakur) తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఆమె కన్నీరు పెట్టుకుంటూ కనిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ఆధార్.. ఓటర్ ఐడీ అనుసంధానానికి గడువు పెంపు..!
ఓటర్ కార్డు(voter ID )తో ఆధార్(Aadhaar) సంఖ్య అనుసంధానానికి గడువును కేంద్రప్రభుత్వం మరోసారి పొడిగించింది. 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు గడువును పెంచింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. గతేడాది జూన్ 17వ తేదీన న్యాయ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం గడువు ఏప్రిల్ 1వ తేదీతో ముగియనుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఓటర్లు ఫామ్ 6-బీను సమర్పించాల్సి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ప్రెస్‌మీట్‌లో కన్నీరు పెట్టుకున్న అనసూయ
బుల్లితెర వ్యాఖ్యాత, నటి అనసూయ (Anasuya) భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం జరిగిన ‘రంగమార్తాండ’ (Rangamarthanda) ప్రెస్‌మీట్‌లో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. సినిమా ఫైనల్ కాపీ చూసి తనకి కన్నీళ్లు వచ్చేశాయని అన్నారు. ‘‘సినిమా ప్రమోషన్స్ విషయంలో కంగారు పడి తరచూ మా దర్శకుడు కృష్ణవంశీకి కాల్ చేసేదాన్ని. సర్.. ప్రమోషన్స్ ఇంకా మొదలుపెట్టలేదు ఎలా? అని ఆయన్ని అడగ్గా ‘మన సినిమా మాట్లాడుతుంది’ అని సమాధానం ఇచ్చేవారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ఈ ఏడాది దేశానికి, తెలంగాణకు కీలకం: కిషన్‌రెడ్డి
ఈ ఏడాది దేశానికి, తెలంగాణకు ముఖ్యమైనదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. పాక్, అఫ్గాన్‌లో భూకంపం.. 11 మంది మృతి..!
ఇప్పటికే ఆర్థిక, ఆహార సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్థాన్(Pakistan), అప్గానిస్థాన్(Afghanistan)ను మంగళవారం భూకంపం(Earthquake ) వణికించింది. దీని ప్రభావం భారత్‌లోనూ కనిపించింది. ఈ విపత్తు కారణంగా తమ దేశంలో దాదాపు 9 మంది మరణించారని, వంద మందికి పైగా గాయపడ్డారని పాక్ అధికారులు వెల్లడించారు. ఇక అఫ్గాన్‌లో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ‘ధమ్కీ’కి బదులు ఆ సినిమా వేసిన థియేటర్ సిబ్బంది.. ప్రేక్షకులు షాక్
విశ్వక్‌సేన్ (Vishwak Sen) ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki). విశ్వక్‌సేన్ స్వీయ దర్శకత్వంలో ఇది రూపుదిద్దుకుంది. నివేదా పేతురాజ్ కథానాయిక. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, వైజాగ్ వేదికగా ఈ సినిమా ప్రదర్శనలో గందరగోళ పరిస్థితి నెలకొంది. విశాఖపట్నంలోని సుకన్య థియేటర్‌లో ‘ధమ్కీ’కి బదులు ‘ధమాకా’ (Dhamaka) చిత్రాన్ని ప్రదర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha Train Tragedy: అంతా 20 నిమిషాల వ్యవధిలోనే.. నిద్రలోనే మృత్యుఒడిలోకి..!
-
India News
Ashwini Vaishnaw: రైలు ప్రమాద కారణాలను ఇప్పటికిప్పుడు చెప్పలేం: కేంద్ర మంత్రి
-
World News
అడవిలో.. పాపం పసివాళ్లు ఏమయ్యారో!
-
India News
Deemed University Status: డీమ్డ్ యూనివర్సిటీ హోదాకు కొత్త నిబంధనలు
-
Ts-top-news News
Delhi Liquor Policy Case: ఈడీ అధికారులు బెదిరించడం వల్లే కవిత పేరు చెప్పారు
-
General News
Odisha Train Accident : అక్కడి వాతావరణం భీతావహం.. ‘ఈనాడు’తో ఏపీ ప్రయాణికులు