Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 17 Mar 2023 17:12 IST

1. TSPSC: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ సహా మరో రెండు పరీక్షలు రద్దు

ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కుదిపేస్తున్న నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష(Group 1 prelims exam)తో పాటు  ఏఈఈ, డీఏవో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రద్దు చేసిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను ఈ ఏడాది జూన్‌ 11న నిర్వహించాలని నిర్ణయించింది. మిగతా పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. DC: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఫ్రాంచైజీతో జట్టు కట్టిన దిల్లీ క్యాపిటల్స్‌

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ విస్తరణ కోసం భారీస్థాయిలో లీగ్‌లు జరుగుతున్నాయి. ఐపీఎల్‌, బిగ్‌బాష్ లీగ్‌, అబుదాబి టీ10 లీగ్‌, దక్షిణాఫ్రికా లీగ్‌.. ఇలా సందడి నెలకొంది. తాజాగా అమెరికాలోనూ క్రికెట్‌ ఖ్యాతిని పెంచేందుకు కొత్తగా టీ20 ఫ్రాంచైజీ లీగ్‌ క్రికెట్ సిద్ధమవుతోంది. మేజర్ లీగ్‌ క్రికెట్ (MLC) పేరిట ఈ ఏడాది జులైలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ క్రమంలో దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. TSPSC పేపర్‌ లీకేజీ: గన్‌పార్కు వద్ద ఉద్రిక్తత.. బండి సంజయ్‌, ఈటల అరెస్టు

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) పేపర్‌ లీకేజీ అంశంపై గన్‌పార్కు అమరవీరుల స్థూపం వద్ద భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi sanjay) దీక్షకు దిగారు. అయితే, ఈ దీక్షకు అనుమతి లేదని తొలుత పోలీసులు తెలిపారు. అయినప్పటికీ దీక్ష చేపట్టడంతో పోలీసులు, బండి సంజయ్‌ మధ్య కాసేపు చర్చలు జరిగాయి. అనంతరం పోలీసులు కాస్త వెనక్కి తగ్గడంతో సంజయ్‌ దీక్ష కొనసాగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. MLC Elections: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ కౌంటింగ్‌.. విజయానికి చేరువలో తెదేపా

ఏపీలోని 9 ఉమ్మడి జిల్లాలు, 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన పట్టభద్రుల(గ్రాడ్యుయేట్‌) ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.  ఉత్తరాంధ్రతో పాటు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తెదేపా సత్తా చాటుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి తెదేపా అభ్యర్థులు భారీ ఆధిక్యంలో ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. World Sleep Day: హ్యాపీగా నిద్రపోండి.. ఉద్యోగులకు ఓ సంస్థ గిఫ్ట్‌..!

కంటికి సరిపడా నిద్ర(Sleep) పోతోనే.. ఒంటికి అలసట తీరుతుంది. రోజు ఉత్సాహంగా కనిపిస్తుంది. పనిలో,ఆలోచనల్లో స్పష్టత  ఉంటుంది. ఇవన్నీ నిపుణులు చెప్పే మాటలు. ప్రపంచ నిద్ర దినోత్సవం(World Sleep Day)(March 17) వేళ  బెంగళూరుకు చెందిన వేక్‌ఫిట్‌ సొల్యూషన్స్(Wakefit Solutions) సంస్థ ఓ సానుకూల నిర్ణయం తీసుకొంది. నేడు ఉద్యోగులకు ఐచ్ఛిక సెలవును ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Delhi: ఆప్‌ ప్రభుత్వం వల్లే దిల్లీ విద్యార్థులు రాణిస్తున్నారు : ఎల్జీ ప్రశంసలు

దిల్లీ ప్రభుత్వం (AAP).. అక్కడి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మధ్య పలు అంశాల్లో కొంతకాలంగా ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. విద్యా ప్రమాణాలు పెంచేందుకు శిక్షణ నిమిత్తం టీచర్లను విదేశాలకు పంపే అంశం మొదలు మేయర్‌ ఎన్నిక వంటి విషయాల్లోనూ ఆప్‌ ప్రభుత్వానికి, ఎల్జీకి (Lt Governor) మధ్య వివాదం కొనసాగింది. ఈ క్రమంలో తమను ప్రశ్నించడానికి అసలు ఎల్జీ ఎవరంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Kohinoor: పట్టాభిషేక సంవత్సరానికి గుర్తుగా.. ప్రదర్శనకు ‘కోహినూర్‌’ వజ్రం!

కోహినూర్‌(Kohinoor).. వలస పాలనకు గుర్తుగా ఇప్పటికీ బ్రిటన్‌ రాజకుటుంబం(Britain Royal Family) చేతిలో ఉన్న అరుదైన వజ్రం. విక్టోరియా మహారాణి ‘కోహినూర్‌’ గురించి రాసిన వీలునామా ప్రకారం.. చార్లెస్‌ భార్య, బ్రిటన్‌ రాణి కెమిల్లా(camilla) ప్రస్తుతం దానిని ధరించాల్సి ఉంది. కానీ, కెమిల్లా తన కిరీటంలో కోహినూర్‌ను పోలిన మరో వజ్రం ధరిస్తారని బకింగ్‌హాం ప్యాలెస్‌ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ క్రమంలోనే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. TCS: ఆ ఆలోచనే రాజీనామాకు దారితీసింది: టీసీఎస్‌ సీఈఓ

ఇంకా ఏదో చేయాలనే ఆలోచనలు తన మదిలో గత కొంత కాలంగా మెదులుతున్నాయని తాజాగా రాజీనామా చేసిన టీసీఎస్‌ సీఈఓ రాజేశ్‌ గోపీనాథన్‌ (TCS CEO Rajesh Gopinathan) తెలిపారు. ఇదే విషయాన్ని టాటా సన్స్‌ ఛైర్మన్‌, తన మెంటార్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌తో చర్చించినట్లు వెల్లడించారు. అయితే, కంపెనీని ఇంకా కొంతకాలం నడపడాన్నే ఇప్పటి వరకు ప్రాధాన్యంగా పెట్టుకున్నానని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Hail rain : వడగళ్లు ఎలా ఏర్పడతాయో తెలుసా!

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం వడగళ్ల(Hail) వాన బీభత్సం సృష్టించింది. రోడ్లు, పొలాలు తెల్లటి మంచుపొరలతో నిండి కశ్మీర్‌ను తలపించాయి. శుక్ర, శనివారాల్లోనూ వర్షాలు(Rain), వడగళ్లు కురిసే సూచనలు ఉన్నాయని, ఆదివారం కూడా వర్ష సూచన ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో వడగళ్లు ఎలా కురుస్తాయో తెలుసుకోండి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Nani: వెంకటేశ్‌ మహా కాంట్రవర్సీ.. అలా జరగడం దురదృష్టకరం: నాని

 ‘కేజీయఫ్‌’ (KGF) ను ఉద్దేశిస్తూ ఇటీవల దర్శకుడు వెంకటేశ్‌ మహా (Venkatesh Maha) చేసిన వైరల్‌ కామెంట్స్‌పై నటుడు నాని (Nani) స్పందించారు. మొత్తం వ్యవహారాన్ని ఉద్దేశిస్తూ దురదృష్టకరమని అన్నారు. వెంకటేశ్‌ మహా మాట్లాడిన విధానం సరికాదని అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని