Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 28 Mar 2023 09:11 IST

1. నాడు తెదేపాలో లక్ష్మీపార్వతిలాగా నేడు వైకాపాలో సజ్జల వ్యవహరిస్తున్నారు

‘నాడు తెదేపాలో లక్ష్మీపార్వతిలాగా నేడు వైకాపాలో సజ్జల వ్యవహరిస్తున్నారు. గతంలో తెదేపాలో తలెత్తిన సంక్షోభం లాంటిది మన పార్టీలో తలెత్తకుండా చూసుకోండి’ అంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. దిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెదేపా వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ మంచివారైనా లక్ష్మీపార్వతి ప్రమేయం ఎక్కువ కావడంతో 1995లో తెదేపాలో సంక్షోభం తలెత్తిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మీటరు రీడింగ్‌.. మీరే తీసుకోచ్చు!

సాంకేతిక వినియోగం పెరిగిన నేపథ్యంలో ఆయా శాఖల సేవల్లో సమూల మార్పులు వస్తున్నాయి. ప్రత్యేక యాప్‌ల ద్వారా క్షణాల్లో సేవలు, పనులు చేసుకోవచ్చు. ఇంటి విద్యుత్తు మీటరు రీడింగు తీసుకోవచ్చు. ఈ అవకాశం ఆ శాఖ కల్పిస్తోంది. తాజాగా విద్యుత్తు శాఖ ‘మీ విద్యుత్తు బిల్లును మీరే ఇంటి నుంచి చెల్లించండి’ అనే నినాదంతో ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం డిజిటల్‌ లావాదేవీలు పెరిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: అనిత

‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తే ఆగమేఘాలపై వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఏకంగా 40 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. వారి గురించి తెలిస్తే సీఎం జగన్‌కు పక్షవాతం వస్తుంది...’ అని తెదేపా మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఐపీఎల్‌ కొంచెం కొత్తగా

క్రికెట్‌ వినోదాన్ని అందించేందుకు మరోసారి ఐపీఎల్‌ ముస్తాబవుతోంది. 16వ సీజన్‌కు శుక్రవారమే తెరలేవనుంది. టీ20 మజాను అందించేందుకు 10 జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఈ సారి లీగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు బీసీసీఐ కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. కొన్నింట్లో మార్పులూ చేసింది. వైడ్‌, నోబాల్‌కు సమీక్ష, టాస్‌ తర్వాత తుది జట్టు ప్రకటన, ఇంపాక్ట్‌ ప్లేయర్‌.. ఇలా ఎన్నో కొత్త విషయాలను ఈ సీజన్‌లో చూడబోతున్నాం. ఫార్మాట్‌ కూడా కాస్త మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. లయ తప్పుతున్న గుండె

కరోనా మహమ్మారి సృష్టించిన భయోత్పాతాల నుంచి బయటపడినట్లుగా భావిస్తున్న తరుణంలో కొత్త సమస్య ఎదురవుతోంది. ప్రపంచమంతటా అకస్మాత్తుగా సంభవిస్తున్న హృద్రోగ మరణాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. మరీ ముఖ్యంగా యువతలో అధికంగా నమోదవుతున్న ఇలాంటి మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వివేకా హత్య కేసును ఎన్నాళ్లు సాగదీస్తారు?

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో పురోగతి లేకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి దర్యాప్తు ఇంకా ఎన్నేళ్లు కొనసాగిస్తారని నిలదీసింది. సీబీఐ దాఖలు చేసిన దర్యాప్తు స్థాయీ నివేదికలో..  పాత విషయాలే తప్ప కొత్తవేమీ లేవని అసహనం వ్యక్తం చేసింది. దర్యాప్తు అధికారిని మార్చాలని సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. శంకరలక్ష్మి డైరీ నుంచే పాస్‌వర్డ్‌ తస్కరణ

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్‌ పోలీసులకు కీలక ఆధారం లభించింది. రెండోసారి పోలీసు కస్టడీలోకి తీసుకొన్న ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి, డాక్యానాయక్‌, రాజేంద్రనాయక్‌ల నుంచి సోమవారం కీలక వివరాలు రాబట్టినట్టు సమాచారం. కాన్ఫిడెన్షియల్‌ విభాగం సూపరింటెండెంట్‌ శంకరలక్ష్మి డైరీ నుంచి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ తస్కరించినట్టు తాజాగా నిర్ధారణకు వచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. దళితులపై దమనకాండ

ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలంటేనే భయమేస్తోందని ఓ దళిత మహిళా ఎమ్మెల్యేనే ఆందోళన వ్యక్తం చేశారంటే.. ఇక్కడ ఆ వర్గాలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో దళితులపై దమనకాండ హద్దుల్లేకుండా సాగుతోంది. దళితుల హత్యలు, వారిపై నేరాలు, అణచివేత, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసుల బనాయింపు, వేధింపులు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆ అయిదు పరీక్షలపై నేడో, రేపో స్పష్టత!

ప్రశ్నపత్రాల లీకేజీతో రద్దయిన, వాయిదా పడిన అయిదు పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలపై టీఎస్‌పీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది. లీకేజీ నేపథ్యంలో నాలుగు నోటిఫికేషన్ల పరీక్షలను కమిషన్‌ రద్దు చేయగా, రెండింటిని వాయిదా వేసింది. గ్రూప్‌-1 ప్రిలిమినరీతో పాటు డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారి(డీఏవో), అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఏఈఈ), అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ) పరీక్షలు రద్దు కాగా.. టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌(టీపీబీవో), వెటర్నరీ అసిస్టెంట్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. దోషుల విడుదలలో ఏకరూప ప్రమాణాలే పాటించారా?

గుజరాత్‌ అల్లర్ల సమయంలో బిల్కిస్‌ బానోపై అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య ఘటనలు భయంకరమైనవని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో దోషులుగా తేలిన 11 మందికి...ఇతర హత్యకేసుల్లోని ఖైదీలను జైలు నుంచి విడుదల చేయడానికి అనుసరించే ప్రమాణాలనే వర్తింపజేశారా? అని ప్రశ్నించింది. దోషుల విడుదలను సవాల్‌ చేస్తూ బాధితురాలు బిల్కిస్‌ బానో, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని