Top Ten New @ 9 AM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... 

Updated : 23 Apr 2022 09:10 IST

1. ‘అమరావతి’పై తీర్పును ఉద్దేశపూర్వకంగానే అమలు చేయలేదు

రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించాలని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని.. ఇందుకు బాధ్యులైన అధికారులు, ప్రభుత్వ పెద్దలను శిక్షించాలంటూ శుక్రవారం హైకోర్టులో కోర్టుధిక్కరణ వ్యాజ్యం దాఖలైంది. యర్రబాలెం గ్రామానికి చెందిన రైతు దోనె సాంబశివరావు, ఐనవోలుకు చెందిన తాటి శ్రీనివాసరావు ఈ వ్యాజ్యాన్ని వేశారు. కోర్టు తీర్పు అమలు చేయకుండా అధికారులను ప్రభావితం చేస్తున్నందుకు ప్రభుత్వ పెద్దలను శిక్షించాలని కోరారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. రాములోరి సన్నిధికి.. రైలు!

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం రైలు మార్గంతో అనుసంధానం కానుంది. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి రాష్ట్రంలో పాండురంగాపురం వరకు కొత్త రైల్వే లైనుకు సంబంధించిన చివరి విడత సర్వే జరుగుతోంది. జూన్‌ కల్లా ఈ నివేదిక సిద్ధం కానుంది. ప్రాథమికంగా రూ.2,800 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు. అనంతరం డీపీఆర్‌ రూపొందించాక నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ మొదలవుతుంది. వచ్చే కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశాలున్నాయి.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. లక్ష జనాభా పైబడిన పట్టణాల్లో 24 గంటలూ విద్యుత్తు ఇవ్వాలి

 దేశంలో లక్ష, అంతకు మించి జనాభా ఉన్న పట్టణాల్లో డిస్కంలు 24 గంటలూ విద్యుత్తు సరఫరా చేయాలని కేంద్ర విద్యుత్తు శాఖ నిర్దేశించింది. తాత్కాలిక అవసరాలకు ఎవరైనా కరెంటు కనెక్షన్‌కు దరఖాస్తు చేస్తే 48 గంటల్లోగా ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు విద్యుత్‌ వినియోగదారుల హక్కుల నియమావళి-2020కి సవరణ చేస్తూ తాజాగా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ఈ ఏడాది 2 3 సార్లు రెపో రేటు పెరగొచ్చు

వడ్డీ రేట్ల విషయంలో ఆర్‌బీఐ వెనకబడి ఏమీ లేదని.. ఈ ఏడాది రెండు లేదా మూడు సార్లు రెపో రేటును పెంచే అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ వైస్‌ ఛైర్మన్‌, సీఈఓ కేకీ మిస్త్రీ అంచనా వేస్తున్నారు. ఉద్యోగ సృష్టి, ఆదాయ స్థాయుల పెంపు, వినియోగంలో వృద్ధికి కారణమయ్యేలా ఆర్థిక వ్యవస్థలో వృద్ధిని కొనసాగించడం దేశానికి అత్యంత ముఖ్యమని ఆయన అన్నారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. ఆ వేగానికి.. పేదరికం క్లీన్‌బౌల్డ్‌

ఉమ్రాన్‌ మాలిక్‌.. టీ20 మెగా టోర్నీ తాజా సంచలనం. 150కి.మీ.లకు పైగా వేగంతో బంతులు విసురుతూ ప్రత్యర్థులను వణికిస్తున్న ఆటగాడు. భారత ప్రధాన బౌలర్‌ అయ్యే సత్తా ఉందంటూ దిగ్గజాల మెప్పు పొందుతున్న బౌలర్‌. ఈ స్థాయికి చేరడం వెనక కఠోర తపస్సు ఉంది.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ఆంగ్లేయుల కుట్రపై ఐన్‌స్టీన్‌ నిరసన!

అది 1929 మార్చి 15. బ్రిటిష్‌ ప్రభుత్వం 32 మందిపై కుట్ర కేసు మోపింది. నిందితులను కోర్టు బోను ఎక్కించింది. 320 మంది సాక్షులను ప్రవేశపెట్టింది. 3,500 సాక్ష్యాధారాలను సమర్పించింది. వాటిని గుదిగుచ్చగా 25 భాగాల గ్రంథమైంది. బాధితుల తరఫునా గట్టి పోరాటమే జరిగింది. వారికి బ్రిటన్‌ కార్మికుల నుంచీ సాయమందింది. విచారణ నాలుగున్నరేళ్లు సాగింది. తీర్పు రాయడానికి జడ్జికి 5 నెలల సమయం పట్టింది. 676 పేజీల తీర్పుపై ప్రపంచవ్యాప్తంగా నిరసన పెల్లుబికింది. ఐన్‌స్టీన్‌ అంతటి శాస్త్రవేత్త నుంచీ సంఘీభావం వ్యక్తమైంది. అదే మీరట్‌ కుట్ర కేసు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. దశ లేని ‘దిశ’... ప్రచారంపైనే సర్కారుకు శ్రద్ధ

బిల్లులు ఇంకా చట్టరూపం దాల్చకుండానే.. ‘దిశ’ చట్టం చేసేశామని దాని కింద శిక్షలు కూడా పడ్డాయని పదేపదే చెప్పారు. గతంలో ఉన్న మహిళా పోలీసుస్టేషన్లకే ‘దిశ’ అంటూ పేరు మార్చి అవే కొత్తవి అన్నారు. మొబైల్‌లో ‘దిశ’ యాప్‌ ఉంటే చాలు ఆపత్కాలంలో పోలీసులు వచ్చి ఆదుకుంటారంటూ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు మొదలుకుని పోలీసు అధికారుల వరకూ ప్రతి ఒక్కరూ విస్తృతంగా ప్రచారం చేశారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. ‘హైదరాబాద్‌-బెంగళూరు’ విస్తరణకు ఆమోదం!

హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారి విస్తరణకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న ఈ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించాలని కేంద్రం నిర్ణ యించింది. అలైన్‌మెంట్‌ ఖరారు కోసం కన్సల్టెన్సీ సంస్థ ఇచ్చిన నివేదికకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను రూపొందించాలని మంత్రిత్వ శాఖ ఆ సంస్థకు సూచించింది.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ఎవరిదీ వైఫల్యం?

చాలినంత సమయం ఉన్నా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్లే పోలవరం ప్రాజెక్టులో ఇంత తీవ్ర సమస్య ఏర్పడిందా? కొత్త ప్రభుత్వం ఏర్పడేనాటికి ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలలో కలిపి 60 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని మాత్రమే మిగిలింది. అదీ మట్టి పని. వరదల కాలం, కరోనా నెల తీసేసినా ఈ పని చేయడానికి చాలినంత సమయం ఉంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా భవిష్యత్తు ఇబ్బందులను అంచనా వేయకుండా వ్యవహరించడం వల్లే 2020 వరదల్లో విధ్వంసం జరిగిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. బట్లర్‌ మళ్లీ బాదేశాడు

విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ లాంటి భారత సూపర్‌ స్టార్లు పరుగుల కోసం తంటాలు పడుతున్న మెగా టోర్నీలో  ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ అసాధారణంగా చెలరేగిపోతున్నాడు. 2016లో విరాట్‌ పరుగుల వరదను గుర్తుకు తెస్తూ శతకాల మోత మోగించేస్తున్నాడు. వరుసగా రెండో మ్యాచ్‌లో అతను మూడంకెల స్కోరును అందుకున్నాడు. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనే అతను మూడో శతకం బాదేయడం విశేషం. అతడి జోరుకు పడిక్కల్‌, శాంసన్‌ మెరుపులు కూడా తోడవడంతో రాజస్థాన్‌ సీజన్లో అత్యధిక స్కోరు (222/2) నమోదు చేసింది. నాటకీయంగా ముగిసిన మ్యాచ్‌లో విజయం కోసం దిల్లీ గట్టిగానే పోరాడినా.. విజయం రాజస్థాన్‌నే వరించింది.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని