Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 18 Mar 2023 21:22 IST

1. WhatsApp New Features: గ్రూప్‌కి టైమింగ్‌ .. కాల్‌ మ్యూట్‌.. వాట్సాప్‌ రాబోయే ఫీచర్లివే!

వాట్సాప్‌ (WhatsApp)లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు వస్తుంటాయి. అలాగే త్వరలో రాబోతున్నాయి అంటూ ఓ జాబితా కూడా తెలుస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రచారంలో ఉండి, త్వరలో అందుబాటులోకి వస్తాయంటున్న ఆరు ఆసక్తికర వాట్సాప్‌ ఫీచర్ల గురించి చూద్దాం! (WhatsApp Beta Features) పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. MLC Election: తెదేపా సంబరాలు చేసుకోవడంతోనే అంతా అయిపోలేదు: సజ్జల

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ తెదేపావి కావని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. పీడీఎఫ్ ఇతర వామపక్షాలకు చెందిన ఓట్లే తెదేపా వైపు మళ్లాయన్నారు. ఎన్నికలు జరిగిన స్థానాలు అన్నింటినీ కలిపి చూడాలని సూచించారు. ఏ రకంగానూ ఈ ఎన్నికలు ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిఫలించవన్నారు. తెదేపా సంబరాలు చేసుకోవడంతోనే అంతా అయిపోలేదని, ఈ ఫలితాలను తాము హెచ్చరికగా భావించడం లేదని సజ్జల స్పష్టంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Sabitha Indrareddy: 24 నుంచి వెబ్‌సైట్‌లో పదో తరగతి హాల్‌టికెట్లు: మంత్రి సబిత

తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్‌టికెట్లు ఈనెల 24వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై విద్యా శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. MIw vs UPw: ఉత్కంఠభరిత మ్యాచ్‌లో యూపీ విజయం.. ముంబయికి తొలి ఓటమి

ప్లే ఆఫ్‌ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో యూపీ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. ఉత్కంఠభరితంగా  సాగిన ఈ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ముంబయి ఇండియన్స్‌ టోర్నీలో తొలిసారి ఓటమిపాలైంది. 128 పరుగుల లక్ష్యం చిన్నదే అయినప్పటికీ..  యూపీ అతి కష్టం మీద చేరుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. KL Rahul - Athiya: వాంఖడే వన్డే హీరో కేఎల్‌ రాహుల్‌కి... అతియా ప్రత్యేక సందేశం

టీమ్‌ ఇండియా స్టార్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) భారీ స్కోర్‌ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఆయన జీవిత భాగస్వామి అతియా శెట్టి (Athiya Shetty) ఇన్‌స్టా వేదికగా  రాహుల్‌కు ప్రత్యేకమైన సందేశం పంపింది. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో కేఎల్‌, జడేజా ఫొటోను ఆమె పంచుకుంది. ‘‘నాకు తెలిసిన అత్యంత దృఢమైన వ్యక్తి కేఎల్‌ రాహుల్‌’’ అని దానికి క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ ఏడాది జనవరిలో  కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) తన ప్రియురాలు, నటి అతియా శెట్టి (Athiya Shetty) మెడలో మూడు ముళ్లు వేసిన విషయం తెలిసిందే.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. CBSE Warning: ఏప్రిల్‌ 1 లోపు పాఠశాలలు తెరవొద్దు.. CBSE ఘాటు హెచ్చరిక

పాఠశాలల రీఓపెనింగ్‌ విషయంలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకెండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) తన అనుబంధ పాఠశాలలను హెచ్చరించింది. ఏప్రిల్‌ 1 లోపు పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దని ఆదేశించింది. కాదని యాజమాన్యాలు క్లాసులు ప్రారంభిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. పది, పన్నెండో తరగతి విద్యార్థులకు అకడమిక్‌ సంవత్సరం (Academic Year) ప్రారంభానికి ముందే క్లాసులు ప్రారంభిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సీబీఎస్‌ఈ తాజాగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. CJI DY Chandrachud: భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కదా.. రిజిజుతో వివాదంపై సీజేఐ వ్యాఖ్య

న్యాయ వ్యవస్థకు ‘భారతీయత’ను జోడించాల్సిన అవసరం ఉందని, స్థానిక బాషలతోనే ప్రజలకు చేరువ కాగలమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ (CJI Chandrachud) అన్నారు. దిల్లీలో శనివారం జరిగిన ఓ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కొలీజియం వ్యవస్థ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju)తో విభేదాలు తదితర అంశాలపై అంశాలపై స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Pakistan: ఇమ్రాన్‌ ఖాన్‌ ఇంటిపైకి 10 వేలమంది పోలీసులు!

పాకిస్థాన్‌(Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan) నివాసంలోకి ఎట్టకేలకు పోలీసులు ప్రవేశించారు. తోషాఖానా అవినీతి కేసులో విచారణకు హాజరయ్యేందుకుగానూ ఇమ్రాన్‌ శనివారం లాహోర్‌ (Lahore) నుంచి ఇస్లామాబాద్‌(Islamabad)కు బయల్దేరారు. ఈ క్రమంలోనే ఇటు దాదాపు 10 వేల మంది పోలీసులు లాహోర్‌ జమాన్‌ పార్క్‌(Zaman Pakr)లోని ఆయన ఇంటిపైకి వెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Krishna Vamsi: సెంటిమెంట్‌ అడ్డొచ్చినా తప్ప లేదు.. 36 గంటలపాటు షూట్‌ చేశాం: కృష్ణవంశీ

‘రంగమార్తాండ’ (Rangamarthanda)లో తన భార్య రమ్యకృష్ణ పోషించిన పాత్రకు సంబంధించి ఓ సన్నివేశాన్ని 36 గంటలపాటు చిత్రీకరించామని దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi) తెలిపారు. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణవంశీ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సెంటిమెంట్‌ అడ్డొచ్చినా సినిమాకే కీలకంగా నిలిచేది కావడంతో ఆ సీన్‌ను తీయక తప్పలేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Chandrababu: ఈ ఫలితాలు.. ప్రజావిజయం, మార్పునకు సంకేతం: చంద్రబాబు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజేతలను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ట్విటర్‌ వేదికగా అభినందించారు. ఈ ఫలితాలు.. ప్రజావిజయం, మార్పునకు సంకేతమని వ్యాఖ్యానించారు. పట్టభద్రుల తీర్పు.. మంచికి మార్గం, రాష్ట్రానికి శుభసూచకమన్నారు. తెదేపా అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వైకాపా అక్రమాలకు ఎదురొడ్డి నిలిచిన పార్టీ శ్రేణులకు సెల్యూట్‌ చేస్తున్నట్టు ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని