icon icon icon
icon icon icon

TDP Election Campaign: ‘మన ఇంటికి బాబు’.. టెక్నాలజీ సాయంతో మన ఇంటికే చంద్రబాబు, లోకేష్‌

సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తోంది. ప్రస్తుతం ఉన్న అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఓటర్లకు మరింత చేరువ అవుతోంది.

Updated : 08 May 2024 17:58 IST

 

అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం (TDP) పార్టీ ప్రచారాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తోంది. ప్రస్తుతం ఉన్న అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఓటర్లకు మరింత చేరువ అవుతోంది. ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా ప్రజలకు తాము అందించబోయే సంక్షేమ పథకాలు, ప్రణాళికలను వివరిస్తున్న పార్టీ.. ఇప్పుడు ఓ అడుగు ముందుకు వేసింది. ఆగ్యుమెంటెడ్‌ రియాల్టీ (Agumented Reality) ద్వారా మన ఇంటికే తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu), ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) వచ్చి మాట్లాడేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను తెలుగుదేశం విడుదల చేసింది. స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ (Manaintiki Babu)ను ఉపయోగించవచ్చు.

యువత భవిష్యత్‌కు తెదేపా ఏయే ప్రణాళికలు రూపొందించింది? బీసీల కోసం ఏ పథకాలు తీసుకురాబోతున్నారు? మంగళగిరి ప్రజల కోసం లోకేష్‌ ఎలాంటి సదుపాయాలు కల్పించబోతున్నారు? తదితర విషయాలను నారా లోకేష్‌ స్వయంగా మన ముందుకు వచ్చి చెబుతున్న తీరు ఆకట్టుకుంటోంది. ఇంకెందుకు ఆలస్యం తెదేపా తీసుకొచ్చిన ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, లోకేష్‌ చెప్పే విషయాలనే కాదు, ఆయనతోనూ ఫొటో దిగే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండంటూ తెదేపా ఎక్స్‌ వేదికగా వివరాలను పంచుకుంది. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు ఇక్కడ ‘మన ఇంటికి బాబు’ క్లిక్‌ చేయండి. లేదా కింది ఉన్న క్యూర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయండి. లోకేష్‌ వివరించే మరిన్ని విషయాలను ఈ కింది లింక్‌లు క్లిక్‌ చేసి చూడండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img