Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 18 Mar 2024 17:08 IST

1. రాజీనామాపై స్పందించిన తమిళిసై సౌందరరాజన్‌

తెలంగాణ గవర్నర్‌ పదవికి రాజీనామా చేయడంపై తమిళిసై సౌందరరాజన్‌ (Tamilisai Soundararajan) స్పందించారు. ‘‘ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నా. తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు. నేను ఎప్పటికీ మీ సోదరినే. నాపై చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’’ అని తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘ప్రజాగళం’ పేరుతో మరిన్ని సభలు.. తెదేపా నిర్ణయం

తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆ పార్టీ సీనియర్‌ నేతలు ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. ఆదివారం ‘ప్రజాగళం’ సభ జరిగిన తీరుపై చంద్రబాబు సమీక్షించారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కార్యాచరణపై చర్చించారు. ‘ప్రజాగళం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని సభలు నిర్వహించాలని తెదేపా నిర్ణయించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వారి సవాల్‌ను స్వీకరిస్తున్నా.. రాహుల్‌ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోదీ ఫైర్‌

‘శక్తి’పైనే తమ పోరాటం అంటూ కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీనిపై ప్రధాని మోదీ (PM Modi) తాజాగా స్పందిస్తూ విపక్షాలను ఎండగట్టారు. ‘శక్తి’ని నాశనం చేస్తామంటూ కొందరు సవాళ్లు విసురుతున్నారని, తాను వాటిని స్వీకరిస్తున్నట్లు చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. దానంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కలిసిన భారాస నేతలు

కాంగ్రెస్‌లో చేరిన భారాస ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై  అనర్హత వేటు వేయాలని భారాస ఎమ్మెల్యేల బృందం సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కలిసింది. స్పీకర్‌ను ఆయన నివాసంలో కలిసిన నేతలు ఈ మేరకు పిటిషన్‌ సమర్పించారు. ఈ అంశంలో చర్యలు తీసుకుంటామని సభాపతి తమకు హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ప్రభుత్వ వెబ్‌సైట్లలో జగన్‌ చిత్రాలు తొలగించాలి: అచ్చెన్నాయుడు

ప్రభుత్వ శాఖల వైబ్‌సైట్లలో సీఎం జగన్‌, మంత్రుల చిత్రాలు తొలగించాలని కోరుతూ ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. మార్చి 16 మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చిందని ఆయన తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. బొప్పూడి సభలో పోలీసుల తీరు అనుమానాలకు తావిస్తోంది: నాదెండ్ల మనోహర్‌

బొప్పూడిలో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం సభలో పోలీసులు వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. దేశ ప్రధాని సభకు జిల్లా అధికారులు బ్లాంక్‌ పాసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. హోమ్‌ ఓటింగ్‌కు ఏప్రిల్‌ 22 లోపు దరఖాస్తు చేసుకోవాలి: వికాస్‌రాజ్‌

లోక్‌సభ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌ రాజ్‌ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇంటి వద్ద ఓటింగ్‌ కోసం ఏప్రిల్‌ 22 లోపు అర్హులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆఫీసుకు రాకపోతే ప్రమోషన్లు ఉండవ్‌.. ఉద్యోగులకు డెల్‌ నోటీసు!

కరోనా సంక్షోభం సమసిపోవటంతో టెక్ కంపెనీలన్నీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (Work from home) విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. ఇప్పటికే చాలా సంస్థలు తమ ఉద్యోగులంతా ఆఫీసుకు రావాలని అల్టిమేటం జారీ చేశాయి. అయినప్పటికీ.. కొందరు ఇంకా ఇంటినుంచి పనికే మొగ్గు చూపుతున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సంక్షోభం వేళ నీటి ఆదాకు బెంగళూరు డాక్టర్‌ ‘4 టిప్స్‌’

కర్ణాటక (Karnataka)లో గత కొన్ని రోజులుగా తీవ్ర నీటి కొరత (Water Crisis) ఏర్పడింది. ముఖ్యంగా రాజధాని బెంగళూరులో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉండటంతో ప్రజల ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు నగరానికి చెందిన ఓ డాక్టర్‌ దివ్య శర్మ సమయస్ఫూర్తితో ఆలోచించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బెంగాల్‌ డీజీపీ సహా 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులపై ‘ఈసీ’ వేటు

లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ.. ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం (Election Commission) కొరడా ఝళిపించింది. గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ల హోంశాఖ కార్యదర్శులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు