Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 03 Jul 2022 09:15 IST

1. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యోగి ఆదిత్య నాథ్

చార్మినార్‌ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దర్శించుకున్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన యోగి.. పాతబస్తీకి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా యూపీ సీఎం స్వయంగా హారతిచ్చారు. తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ లక్ష్మణ్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌ తదితరులు యోగి ఆదిత్యనాథ్‌ వెంట ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రబ్బర్‌స్టాంప్‌ అన్న పేరెలా వచ్చింది?

రాష్ట్రపతి పదవి రబ్బర్‌స్టాంప్‌ వంటిదన్న పేరు చిరకాలంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు ఆమోదముద్ర వేయడం తప్ప ప్రత్యేక అధికారాలు ఏమీ లేవన్న ఉద్దేశంతో ఇలాంటి అభిప్రాయం ఏర్పడింది. రాష్ట్రపతులుగా బాబూ రాజేంద్ర ప్రసాద్‌, సర్వేపల్లి రాధాకృష్ణన్‌, జాకీర్‌ హుసేన్‌, వి.వి.గిరి హయాముల్లో ఇలాంటి వాదన వినిపించలేదు. అనంతరం ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌ హయాంలో ఈ పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పట్లో ఇందిరాగాంధీ ప్రభుత్వం వివిధ అంశాలకు సంబంధించి తరచూ ఆర్డినెన్స్‌లను జారీ చేసేది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో మంటలు

సికింద్రాబాద్‌ నుంచి దిల్లీ వెళ్తున్న దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు చివరి బోగీలో మంటలు చెలరేగాయి. భువనగిరి దగ్గరలోని పగిడిపల్లి మధ్య శనివారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు చివరి బోగీలో ఈ మంటలు కనిపించాయి. ఇది లగేజీ బోగీ అని రైల్వే అధికారులు తెలిపారు. మంటలను గమనించిన సిబ్బంది డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు భయాందోళనలతో పరుగులు తీశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రయ్‌మని ఎగిరింది.. ఠీవిగా తిరిగింది!

మానవ రహిత యుద్ధ విమానాల తయారీలో మన దేశం స్వయం సమృద్ధి సాధించడానికి మరెంతో కాలం వేచి చూడాల్సిన పనిలేదు. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లా నాయకనహట్టి దగ్గర ఉన్న డీఆర్‌డీవో ఏరోనాటికల్‌ టెస్టు రేంజ్‌లో శుక్రవారం నిర్వహించిన రిమోట్‌ కంట్రోల్డ్‌ మానవ రహిత యుద్ధ విమాన ప్రయోగం విజయవంతమైనట్లు అధికారులు శనివారం ప్రకటించారు. దీన్ని పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* వస్తున్నా.. ‘కాచుకోండి’

5. ₹3వేలకు భర్తను అద్దెకిస్తున్న మహిళ

బ్రిటన్‌కు చెందిన చెందిన లారా యంగ్‌ అనే ఓ మహిళ తన భర్తను అద్దెకిస్తోంది. ఇందుకోసం ‘రెంట్‌ మై హ్యాండీ హస్బెండ్‌’ పేరుతో ఓ వెబ్‌సైట్‌ ప్రారంభించింది. చిన్నచిన్న పనులు చేసిపెట్టేందుకు తన భర్తను అద్దెకు ఇస్తున్నట్లు మహిళ తెలిపింది. ఇందుకోసం రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నట్లు పేర్కొంది. లారా భర్త జేమ్స్‌.. ఇంటి పనుల్లో దిట్ట. చిన్నచిన్న పనులను అలవోకగా పూర్తి చేస్తాడు. పెయింటింగ్‌, అలంకరణ, టైల్స్‌, కార్పెట్లు ఏర్పాటు చేయడం వంటి పనులను నేర్పుతో చేస్తాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. YSRCP: బస్సు పెట్టాం.. టిఫిన్లున్నాయి.. రావాలి!

‘బస్సు పెట్టాం.. అల్పాహారాలు ఏర్పాటు చేశాం. వైకాపా ప్లీనరీకి ప్రతి గ్రామం నుంచి సుమారు 20 మందికి తగ్గకుండా రావాలి’ అని వాలంటీర్లే ఆహ్వానిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా వైకాపా ప్లీనరీ కొవ్వూరులో ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో చాగల్లు సచివాలయ వాలంటీర్లు తమ పరిధిలోని కుటుంబాల వారికి వాట్సప్‌లో సందేశాలు పంపారు. సమావేశానికి సొసైటీ ఛైర్మన్లు, పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, నాయకులు వస్తారని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆ ప్రచారం ఫేక్‌.. నేడు మెట్రో రైళ్లు యథాతథం

మెట్రో రైళ్లు ఆదివారం యథాతథంగా నడవనున్నాయి. ప్రధాని హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా భద్రతా రీత్యా రెండురోజులు మెట్రోసేవలు బంద్‌ అని సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న ప్రచారాన్ని మెట్రో అధికారులు ఖండించారు. రోజువారీ మాదిరిగానే ఆదివారం మెట్రో రైళ్లు మూడు కారిడార్లలో యథాతథంగా నడుస్తాయని హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఇంతందం.. ఏమిటీ రహస్యం?

అందం అనగానే ఠక్కుమని ఐశ్వర్యారాయ్‌ గుర్తొస్తుంది. యాభైకి దగ్గరవుతున్నా ఆమె సౌందర్యం ఇసుమంత కూడా తగ్గలేదు! సుస్మిత, శిల్ప, అనుష్క ఇంకా కొందరు తారలూ వయసును జయించినట్టు కనిపిస్తుంటారు. అదంతా మేకప్‌ మాయే అనుకుంటే పప్పులో కాలేసినట్టే... మరోపక్క ముప్పైల్లోకి అడుగు పెట్టామో లేదో అందం తరుగుతోందని బెంగపడే అమ్మాయిలెందరో! ఈ తారలంతా యువతరంతో పోటీపడుతూ అందాన్ని ఎలా కాపాడుకుంటున్నారు? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కంట్లోంచి బుల్లెట్‌ బయటకొచ్చింది!

రింకూ సింగ్‌ రాహీ... తాను పనిచేస్తున్న డిపార్ట్‌మెంట్‌లో 83 కోట్ల రూపాయల అవినీతిని గుర్తించారు. ఆ అక్రమాన్ని నిలదీసినందుకు ప్రత్యర్థులు చేసిన దాడిలో చూపునీ, వినికిడినీ కోల్పోయారు. అప్పటికీ ప్రశ్నించడం ఆపకపోవడంతో పిచ్చివాడనే ముద్రవేసి ఆసుపత్రిలో పడేశారు. అయినా అలుపెరగక ముందుకు సాగిన రింకూ సింగ్‌... అంతటి కష్టసమయంలోనూ పట్టుబట్టి చదివి ఇటీవలి సివిల్స్‌ ఫలితాల్లో 683వ ర్యాంకు సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. IND vs ENG : ఐదో టెస్టు మ్యాచ్‌ రెండో రోజు ఆట విశేషాలు..

భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరుగుతోన్న టెస్టు మ్యాచ్‌ రెండో రోజు ఆటలోనూ టీమ్‌ఇండియానే పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 416 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఇంగ్లాండ్ టాప్‌ ఆర్డర్‌ను బుమ్రా బౌలింగ్‌ దళం కుప్పకూల్చింది. రెండో రోజు ఆట ముగిసేసమయానికి ఇంగ్లాండ్‌ 84/5 స్కోరుతో నిలిచింది. రెండో రోజు ఆటకు సంబంధించి హైలైట్స్‌ ఒకసారి చూసేద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని