logo

Hyderabad Metro: ఆ ప్రచారం ఫేక్‌.. నేడు మెట్రో రైళ్లు యథాతథం

మెట్రో రైళ్లు ఆదివారం యథాతథంగా నడవనున్నాయి. ప్రధాని హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా భద్రతా రీత్యా రెండురోజులు మెట్రోసేవలు బంద్‌ అని సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న ప్రచారాన్ని మెట్రో అధికారులు ఖండించారు. రోజువారీ మాదిరిగానే ఆదివారం మెట్రో రైళ్లు

Published : 03 Jul 2022 07:35 IST

ఈనాడు, హైదరాబాద్‌: మెట్రో రైళ్లు ఆదివారం యథాతథంగా నడవనున్నాయి. ప్రధాని హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా భద్రతా రీత్యా రెండురోజులు మెట్రోసేవలు బంద్‌ అని సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న ప్రచారాన్ని మెట్రో అధికారులు ఖండించారు. రోజువారీ మాదిరిగానే ఆదివారం మెట్రో రైళ్లు మూడు కారిడార్లలో యథాతథంగా నడుస్తాయని హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.
* పరేడ్‌గ్రౌండ్‌లో ఆదివారం సాయంత్రం జరిగే భాజపా విజయ్‌సంకల్ప్‌ సభ కారణంగా నగరంలో మ.2 గంటల నుంచి రాత్రి 10 వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను పోలీసులు విధించారు. సభకు వచ్చే వాహనాలు, కార్యకర్తలతో పరేడ్‌ మైదానం చుట్టు పక్కల రద్దీ అధికంగా ఉంటుంది. ఆయా మార్గాల్లో వెళ్లే వారికి ట్రాఫిక్‌ ఆంక్షల నేపథ్యంలో మెట్రోనే ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా నిలవనుంది.

సభకు వచ్చేలా..
సభ జరిగే సమీపంలోనే పరేడ్‌ గ్రౌండ్‌, జేబీఎస్‌ మెట్రోరైలు స్టేషన్లు ఉండటంతో సిటీలోని పలు ప్రాంతాల నుంచి భాజపా కార్యకర్తల బృందాలు మెట్రోలో వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఆదివారం హాలిడే పాస్‌ రూ.59కే మెట్రో అందిస్తోంది. దీంతో ఎక్కువ మంది ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా మెట్రోని వినియోగించుకుని సభ ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు. దూర ప్రాంతాల నుంచి రైళ్లలోనూ కార్యకర్తలు హైదరాబాద్‌ వస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని