Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 20 Aug 2022 10:01 IST

1. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు?

ప్రస్తుతం జేబులో రూపాయి లేకపోయినా.. చేతిలో మొబైల్‌ ఉంటే చాలు.. ధైర్యంగా దుకాణాలకు వెళ్లిపోతున్నాం. యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) ద్వారా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి.. లేదా సంబంధిత వ్యాపారి ఫోన్‌ నెంబరు తీసుకుని, అతని మొబైల్‌కు నగదు బదిలీ చేసే వీలుండటమే ఇందుకు కారణం. కానీ, యూపీఐ లావాదేవీలపైనా ఛార్జీలను వసూలు చేసేందుకు ఉన్న అవకాశాలను ఆర్‌బీఐ పరిశీలిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ల ఉయ్యాల జంపాల..

2. దినదిన గండం... నూరేళ్ల భవిష్యత్తు

పెచ్చులూడుతున్న పైకప్పులు... నెర్రెలిచ్చిన గోడలు... ఎక్కడ చూసినా ఇవే పరిస్థితులు. సర్కారు బడులు శిథిలావస్థకు చేరాయి. అక్కడ చదివే పిల్లలకు గండంగా మారాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో పిల్లలు ఆ భవనాల్లోనే బిక్కుబిక్కుమంటూ చదువుకుంటున్నారు. ఇటీవల రోజుల తరబడి వర్షాలు కురవడంతో నాని ఉన్న భవనాలు మరింత ప్రమాదకరంగా తయారయ్యాయి. అయినా ప్రభుత్వ యంత్రాంగంలో ఏమాత్రం కదలిక ఉండడం లేదు. కనీసం జాగ్రత్తలూ తీసుకోవడం లేదు. తాజాగా ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాల వరండా పైకప్పు కూలి ముగ్గురు విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నిధుల్లేవంటూ..నిత్యం నరకం చూపిస్తూ!

చింతలేని రహదారుల వ్యవస్థ లక్ష్యంగా ప్రారంభించిన ఎస్సార్డీపీ(వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం) కష్టాల్లో పడింది. ప్రధాన నగరంలోని కీలక రహదారులపై చేపట్టిన పైవంతెనల పనులు నత్తనడకన సాగుతున్నాయి. రోడ్లపై పడుతున్న గుంతలను అలాగే వదిలేస్తూ, బారికేడ్లు ఏర్పాటు చేయకుండా పనులు చేస్తున్నారు. గడువు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా.. గుత్తేదారులు, ఇంజినీర్ల నిర్లక్ష్యంతో ఆయా రోడ్లపై పౌరులు నిత్యం నరకం చూస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఆపదొచ్చిందా.. యాప్ తో మాయం

4. సిలబస్‌ సీబీఎస్‌ఈ.. పరీక్షలు రాష్ట్ర బోర్డువి!

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సీబీఎస్‌ఈ సిలబస్‌ చదివి.. రాష్ట్ర బోర్డు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అధికారుల నిర్ణయంతో భవిష్యత్తులో విద్యార్థులకు వింత అనుభవం ఎదురుకానుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు చేస్తామని, 2025లో పదో తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ పరీక్షలు రాస్తారని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీనికి అనుగుణంగా ఈ ఏడాది ఎనిమిదో తరగతికి జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) పుస్తకాలను ముద్రించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఒకట్రెండు రోజుల్లో కరెంటుకు ఇబ్బందులు

రానున్న ఒకటి రెండు రోజుల్లో కరెంటు సరఫరాకు కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని, ప్రజలు సహకరించాలని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఒక ప్రకటనలో కోరారు. కేంద్ర ప్రభుత్వం ముందుగా నోటీసు ఇవ్వకుండా ఎక్స్ఛేంజీ నుంచి కరెంటు కొనకుండా ఆదేశాలిచ్చిందని ఆయన తెలిపారు. ‘పాత బకాయిలు రూ.1360 కోట్లు చెల్లించినా, కరెంటు కొనకుండా ఆపడం బాధాకరం. దీనిపై శుక్రవారం సీఎం కేసీఆర్‌, మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని సీఎం సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఏం జరిగింది..?

6. ఈ వేరియంట్లతో భారీగా గాల్లోకి వైరస్‌

కరోనాలో ఏ వేరియంట్‌ బారినపడ్డ వారి నుంచి ఎక్కువగా వైరస్‌ వెలువడుతుందన్నదానిపై శాస్త్రవేత్తలు తాజాగా అధ్యయనం చేశారు. కొవిడ్‌-19 కారక సార్స్‌-కొవ్‌-2లోని ఆల్ఫా, డెల్టా, ఒమిక్రాన్‌ సోకినవారి నుంచి ఎక్కువగా వైరస్‌ రేణువులు గాల్లోకి వెలువడతాయని తేల్చారు. బాధితుల శ్వాస నుంచి గాల్లోకి చేరిన సూక్ష్మ తుంపర్లను పీల్చడం కూడా కొవిడ్‌ వ్యాప్తికి ఎక్కువగానే కారణమవుతున్నట్లు ఇప్పటికే వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై అమెరికాలోని మేరీల్యాండ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కొవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌ వచ్చిందన్నారు.. రూ.లక్షలు కొట్టేశారు

‘మీరు కొవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌కు అర్హత సాధించారు.. మీ పూర్తి వివరాలు పంపితే 25 వేల పౌండ్లు(సుమారు రూ.23.50 లక్షలు) ఉన్న పార్సిల్‌ మీకు పంపిస్తాం.. దాన్ని తీసుకునేందుకు కస్టమ్స్‌ ఛార్జీలు, జీఎస్టి మనీ కన్వర్షన్‌ ఛార్జీలు చెల్లించండి... పార్సిల్‌ చేతికి ఇస్తామంటూ రకరకాల రుసుముల పేరు చెప్పి లక్షలు వసూలు చేశారు. ఆ తరువాత ఎందుకు పనికి రాని ఒక కవర్‌ చేతికి ఇచ్చారు’. సరికొత్త తరహాలో జరిగిన ఈ సైబర్‌ నేరం విజయవాడలో తాజాగా వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మా సొమ్ము మా కివ్వడానికి ఇన్ని కష్టాలా

8. మూణ్నెల్లు గడిచినా జీవో ఇవ్వరే..!

 రాష్ట్రంలో 9,168 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనల తయారీపై జాప్యం నెలకొంది. భారీ సంఖ్యలో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ ప్రకటన మరింత ఆలస్యం కానుంది. జిల్లాస్థాయి పోస్టులైన వీటిని వేగంగా భర్తీ చేసేందుకు ఈ ఏడాది మేనెలాఖరు నాటికే నోటిఫికేషన్‌కు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 3 నెలలు గడుస్తున్నా ఆ పోస్టులు గుర్తిస్తూ ఆర్థికశాఖ ఇప్పటికీ కనీసం ఉత్తర్వులు జారీ చేయలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సీఎస్‌ఈలో సీటుందా?

బీటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ సీటే కావాలి.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరే అవ్వాలి.. ప్రస్తుతం విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్‌ ఇది. ప్రాంగణ నియామకాల్లోనే ఉద్యోగం పొందడం, లేదంటే పీజీ చేసేందుకు విదేశాలకు వెళ్లాలనే దృక్పథంతో అందరూ ఈ బ్రాంచిపైనే ఆసక్తి చూపుతున్నారు. కరోనాతో డిజిటలైజేషన్‌లో వచ్చిన మార్పుల కారణంగా సాఫ్ట్‌వేర్‌ నియామకాలు భారీగా పెరగడం.. ఇతర విభాగాల్లో ప్రాంగణ నియామకాలు సరిగా లేకపోవడంతో ఇప్పుడు విద్యార్థులు సీఎస్‌ఈ సీట్ల కోసం పోటీ పడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సీఏకు అమ్మాయిల సై

10. రోడ్డులేని పల్లె తల్లి ప్రసవానికి దారే దాపు!

రోడ్డు సౌకర్యం లేని గ్రామంలో పురిటి నొప్పులతో వేదనపడుతున్న గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె దారిపక్కనే ప్రసవించారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం పెదవలస పంచాయతీ పరిధిలో జరిగింది. పిల్లిగొంది గ్రామానికి చెందిన వంతల శాంతి నిండు గర్భిణి. శుక్రవారం పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ‘108’ వాహన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రోడ్డు సౌకర్యం లేని ఆ ఊరికి.. అంబులెన్సు వెళ్లలేని పరిస్థితి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని