logo

విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ కూడలి : ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ల ఉయ్యాల జంపాల..

విజయవాడలో అత్యంత ట్రాఫిక్‌ రద్దీ ఉండే బెంజ్‌ సర్కిల్‌ కూడలిలో ఇటీవల అమర్చిన ట్రాఫిక్‌ సిగ్నల్‌్్స ఇవి. రెండు పైవంతెనల దిమ్మెలకు మేకులుకొట్టి తీగలతో వీటిని బిగించారు. గాలివచ్చినప్పుడు ఊగుతూ.. అటుఇటూ ప్రమాదకరంగా కదులుతున్నాయి. దీంతో వాహనదారులకు సిగ్నల్స్‌ సరిగా కనపడకపోవడంతో రెడ్‌ సిగ్నల్‌

Updated : 20 Aug 2022 08:39 IST

విజయవాడలో అత్యంత ట్రాఫిక్‌ రద్దీ ఉండే బెంజ్‌ సర్కిల్‌ కూడలిలో ఇటీవల అమర్చిన ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఇవి. రెండు పైవంతెనల దిమ్మెలకు మేకులుకొట్టి తీగలతో వీటిని బిగించారు. గాలివచ్చినప్పుడు ఊగుతూ.. అటుఇటూ ప్రమాదకరంగా కదులుతున్నాయి. దీంతో వాహనదారులకు సిగ్నల్స్‌ సరిగా కనపడకపోవడంతో రెడ్‌ సిగ్నల్‌ పడినా వచ్చేస్తున్నారు. నిబంధనల ప్రకారం మూడు డైరెక్షన్లలోని సిగ్నల్స్‌ వాహనదారులకు కనిపించేలా ఒకే స్తంభానికి అమర్చాలి. ఎత్తులో కాకుండా వాహనదారులకు కనిపించేలా ఒక నిర్ణీత ఎత్తులో వీటిని అమర్చాల్సి ఉంది.కొన్నింటిని వంతెనలకు వేలాడదీసి వంతెనకు మేకులుకొట్టి అమర్చారు. వీటివల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

     -ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని