రోడ్డులేని పల్లె తల్లి ప్రసవానికి దారే దాపు!

రోడ్డు సౌకర్యం లేని గ్రామంలో పురిటి నొప్పులతో వేదనపడుతున్న గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె దారిపక్కనే ప్రసవించారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం పెదవలస పంచాయతీ పరిధిలో జరిగింది.

Published : 20 Aug 2022 04:51 IST

రోడ్డు సౌకర్యం లేని గ్రామంలో పురిటి నొప్పులతో వేదనపడుతున్న గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె దారిపక్కనే ప్రసవించారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం పెదవలస పంచాయతీ పరిధిలో జరిగింది. పిల్లిగొంది గ్రామానికి చెందిన వంతల శాంతి నిండు గర్భిణి. శుక్రవారం పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ‘108’ వాహన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రోడ్డు సౌకర్యం లేని ఆ ఊరికి.. అంబులెన్సు వెళ్లలేని పరిస్థితి. దీంతో ఫీడర్‌ అంబులెన్సును పంపించారు. ఆ వాహనంలో ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు అధికమయ్యాయి. దీంతో ఆశ కార్యకర్త, స్థానిక మహిళలు వస్త్రాలు అడ్డుపెట్టి దారిపక్కనే పురుడు పోశారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

- గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని