Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 26 Sep 2022 10:08 IST

1. స్టేట్‌ బ్యాంకులో పీఓ ఉద్యోగాలు!

బ్యాంక్‌ పరీక్షలు రాసే అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రొబేషనరీ ఆఫీసర్ల నోటిఫికేషన్‌ను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) విడుదల చేసింది. దీని ద్వారా 1673 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 1600 రెగ్యులర్‌, 73 బ్యాక్‌లాగ్‌ ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హతతో వీటికి పోటీ పడవచ్చు. ఇంతకుముందే ఎస్‌బీఐ జూనియర్‌ అసోసియేట్స్‌ నోటిఫికేషన్‌ వెలువడింది. రెండు వారాల వ్యవధిలోనే ప్రొబేషరీ ఆఫీసర్ల ప్రకటన.. ఉద్యోగార్థులకు ఎంతో మంచి అవకాశం! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఊరెళ్తున్నారా.. తస్మాత్‌ జాగ్రత్త..!

బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి అక్టోబరు 9 వరకు విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని చాలా మంది పిల్లలకు సెలవులు ఉన్నాయని ఇళ్లకు తాళాలు వేసి సొంత ఊళ్లకు, తీర్థయాత్రలకు వెళ్లడం సాధారణమే. గతంలో జరిగిన దాదాపు అన్ని దొంగతనాలు తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లోనే జరిగాయన్నది గుర్తుంచుకోవాలి. ఇలాంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో పిల్లలు బావులు, చెరువులు, గుంతల్లో ఈతకు దిగుతుంటారు. ఈ విషయంలోనూ పర్యవేక్షణ అవసరమని గుర్తుంచుకోవాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. శతాబ్ది.. వందల సీట్లు ఖాళీ

అది తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌.. అన్నీ ఏసీ బోగీలు, అందులో ఒక అద్దాల బోగీ.. వేగంగా, ఆహ్లాదకర ప్రయాణం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ ఛార్జీల బాదుడు కారణంగా సికింద్రాబాద్‌-పుణె మధ్య నడుస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులను అంతగా ఆకట్టుకోలేకపోతోంది. ఈ రైలులో నిత్యం వందల సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఇదే మార్గంలో ప్రయాణించే ఇతర రైళ్లతో పోలిస్తే దాదాపు 50% కంటే అధికంగా ఛార్జీలు ఉండడం, డైనమిక్‌ ఛార్జీల విధానం అమలవుతుండడం ఇవన్నీ ప్రభావం చూపుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రాచనగరి... నయన మనోహరి..!

‘నాడ హబ్బ’ విఖ్యాత దసరా ఉత్సవాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు (సోమవారం) ప్రారంభించనున్నారు. చాముండి బెట్టపై అమ్మవారికి 9.45 నుంచి 10.05 గంటల మధ్యలో పూజ చేసి, అమ్మవారి ఉత్సవమూర్తికి పుష్పార్చన చేసి ఉత్సవాలను ప్రారంభిస్తారు. ప్రత్యేక విమానంలో 9 గంటలకు మండకళ్లి విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో ఆమె చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా చాముండిబెట్టకు చేరుకుంటారు. రాచప్రాసాదంలో ప్రైవేటు దర్బారును పురస్కరించుకుని సందర్శకులను నేడు అనుమతించమని ప్యాలెస్‌ అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అటార్నీ జనరల్‌ పదవిని తిరస్కరించిన ముకుల్‌ రోహత్గీ

కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన అటార్నీ జనరల్‌ పదవిని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ తిరస్కరించారు. ఈ విషయాన్ని ఆయన ఆదివారం పీటీఐ వార్తాసంస్థతో ధ్రువీకరించారు. తన నిర్ణయం వెనుక నిర్దిష్ట కారణం ఏమీ లేదన్నారు. ప్రస్తుతం అటార్నీ జనరల్‌గా కొనసాగుతున్న కేకే వేణుగోపాల్‌ పదవీకాలం ఈనెల 30తో ముగియనుంది. అనంతరం కొనసాగడానికి వేణుగోపాల్‌ ఇప్పటికే తిరస్కరించారు. దీంతో ఆ పదవిని చేపట్టాలని రోహత్గీని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించినా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఏది క్రీడా స్ఫూర్తి?

ఇంగ్లాండ్‌ మహిళలతో చివరి వన్డే సందర్భంగా ఆ జట్టు బ్యాటర్‌ చార్లీ డీన్‌ను భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ మన్కడింగ్‌ చేయడం ప్రపంచ క్రికెట్లో పెద్ద చర్చకే దారి తీసింది. దీప్తి శర్మ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిందని, భారత జట్టు తర్వాత కూడా అప్పీల్‌ను వెనక్కి తీసుకోకపోవడం దారుణమని ఇంగ్లాండ్‌ మద్దతుదారులు విమర్శించారు. విజయం కోసం భారత జట్టు క్రీడా స్ఫూర్తిని తుంగలో తొక్కిందని వారు వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భర్త కళ్లెదుటే భార్యపై ఆరుగురు వ్యక్తుల అత్యాచారం

భర్త కళ్లెదుటే ఓ మహిళ ఆరుగురు కామాంధుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన సంఘటన ఝార్ఖండ్‌లో పలము ప్రాంతంలోని సాత్‌బర్వా పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. భర్తపై ఆగ్రహించిన భార్య లటేహర్‌ప్రాంతంలోని మాణికలో గల తన పుట్టింటికి బయలుదేరింది. దీంతో తన భార్యను వెతుక్కుంటూ ఆ వ్యక్తి బైక్‌పై సాత్‌బర్వా ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ నడిచి వెళ్తున్న ఆమెను గమనించి ఇంటికి తిరిగిరావాలంటూ ఒప్పించేందుకు బతిమలాడుతున్నాడు. అదే సమయానికి ఆ మహిళ బావ కూడా అక్కడికి చేరుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కుంకుమార్చనతో అమ్మ ప్రసన్నం

‘అరుణాం కరుణాతరంగితాక్షీం’ అనేది అమ్మ ధ్యానశ్లోకం. ‘ఓ ఎర్రటి మాతా, నిరంతరం కళ్లలో కరుణ, వాత్సల్యం నింపుకున్న తల్లీ’ అంటూ వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని తదితర వశిన్యాది దేవతలు అమ్మను ప్రేమగా కీర్తించారు. అమ్మ ఎరుపు, ఆమె ధరించిన వస్త్రం ఎరుపు, అమ్మవారి అర్చనాద్రవ్యం ఎరుపు. ఈ అరుణ వర్ణం రజస్సుకి ప్రతీక. సృష్టికి మూలం. స్త్రీత్వానికి గుర్తు. ఇదే స్త్రీలకు ఐదోతనాన్ని, దీర్ఘసుమంగళీ యోగాన్ని ఇచ్చే ఈ సర్వమంగళ వర్ణం వెనకున్న రహస్యం. ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవాలంటే కుంకుమార్చనకు మించినది లేదంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. షాపింగ్‌ భద్రమేనా?

పండగ రోజులు సమీపిస్తున్నాయి. నెట్టింట అడుగుపెడితే చాలు.. చుట్టూ కళ్లు చెదిరే ఆఫర్లు. మరి అవి సురక్షితమేనా? ఇప్పుడు ఆన్‌లైన్‌లో వ్యాపారం చేస్తున్న వారెందరో! అయితే అవన్నీ సురక్షితమైనవే అని చెప్పలేం. కాబట్టి, పరిచయమున్న, నమ్మకమైన వాటిల్లోనే కొనుగోళ్లు చేపట్టండి. కొత్తదాన్ని ప్రయత్నించినా.. అవసరమైన దానికంటే ఎక్కువ సమాచారం ఇవ్వకండి. పర్సనలైజ్‌డ్‌ ఎక్స్‌పరీయన్స్‌ పేరుతో లింగం, వయసు, పుట్టినరోజు వంటివి అడగడం సహజమే! దానికి తోడు ఆధార్‌, బ్యాంకు అకౌంట్‌ సేవ్‌ చేయడం లాంటివి అడుగుతోంటే ఆలోచించాల్సిందే! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పాలారు నదిపై ఆనకట్టల నిర్మాణాలు ఆపాలి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాలారు నదిపై నిర్మించ తలపెట్టిన ఆనకట్టల నిర్మాణాన్ని నిలిపేయాలని తమిళనాడు ప్రతిపక్ష నేత, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఏపీ చట్టవిరుద్ధంగా వీటిని నిర్మిస్తోందని పేర్కొన్నారు. ఏ రాష్ట్రమైనా ఆనకట్టలు నిర్మించేటప్పుడు సంబంధిత నది ప్రవహించే రాష్ట్రాల అంగీకారం తీసుకోవాలని గతంలో కోర్టు తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని