షాపింగ్‌ భద్రమేనా ?

పండగ రోజులు సమీపిస్తున్నాయి. నెట్టింట అడుగుపెడితే చాలు.. చుట్టూ కళ్లు చెదిరే ఆఫర్లు. మరి అవి సురక్షితమేనా?

Published : 26 Sep 2022 00:23 IST

పండగ రోజులు సమీపిస్తున్నాయి. నెట్టింట అడుగుపెడితే చాలు.. చుట్టూ కళ్లు చెదిరే ఆఫర్లు. మరి అవి సురక్షితమేనా?

* ఇప్పుడు ఆన్‌లైన్‌లో వ్యాపారం చేస్తున్న వారెందరో! అయితే అవన్నీ సురక్షితమైనవే అని చెప్పలేం. కాబట్టి, పరిచయమున్న, నమ్మకమైన వాటిల్లోనే కొనుగోళ్లు చేపట్టండి. కొత్తదాన్ని ప్రయత్నించినా.. అవసరమైన దానికంటే ఎక్కువ సమాచారం ఇవ్వకండి. పర్సనలైజ్‌డ్‌ ఎక్స్‌పరీయన్స్‌ పేరుతో లింగం, వయసు, పుట్టినరోజు వంటివి అడగడం సహజమే! దానికి తోడు ఆధార్‌, బ్యాంకు అకౌంట్‌ సేవ్‌ చేయడం లాంటివి అడుగుతోంటే ఆలోచించాల్సిందే!

* పాస్‌వర్డ్‌లను సాధారణంగానే మరచిపోతుంటాం. అందుకే చాలామంది అన్నింటికీ ఒకే పాస్‌వర్డ్‌ పెడుతుంటారు. ఇదే తప్పంటారు నిపుణులు. తరచూ ఉపయోగించే ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్లకైనా ఒక్కోదానికి ఒక్కో పాస్‌వర్డ్‌ తప్పనిసరి అంటున్నారు. అలాగని తేలికైన వాటినీ ఎంచుకోవద్దట. అక్షరాలు, నంబర్లు, ప్రత్యేక గుర్తులతో కూడి ఉండేలా చూసుకోవాలి.

* తగ్గింపు.. సంస్థలు వినియోగదారులను ఆకర్షించే మంత్రం. ధర తగ్గతోంది కాబట్టి, మనమూ తీసుకోవడానికి ఆసక్తి చూపుతాం. కానీ ఎంతవరకూ? నలభై, యాభై వేల రూపాయలది రూ.4-5 వేలకు వస్తుందంటే నమ్మశక్యమేనా! అలాంటివాటిని నమ్మకపోవడమే మంచిది. లేదంటే డబ్బులు కోల్పోవడమో.. పాడైపోయిన లేదా తక్కువ నాణ్యతవి అందుకోవడమో జరుగుతుంది. ఏదైనా మనకు నష్టమే.

* పండగలు, వేడుకల్లో స్నేహితులకు గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంటుంటాం. ఏం తీసుకోవాలో తెలియనప్పుడు గిఫ్ట్‌కార్డులను ఇవ్వడం ఇప్పుడు సాధారణమైంది. నమ్మకమైన సంస్థదే తీసుకోండి. వీటికీ కొన్ని నిబంధనలుంటాయి. వాటన్నింటినీ జాగ్రత్తగా గమనించాకే తీసుకుంటే అవతలి వారికీ ప్రయోజనకరం.

* వీలైనంతవరకూ వస్తువు అందుకున్నాకే డబ్బులు చెల్లించడం మేలు. లేదా క్రెడిట్‌ కార్డుతో కొనండి. ఆన్‌లైన్‌ అకౌంట్‌, డెబిట్‌ కార్డు వివరాలను సేవ్‌ చేయకపోవడమే మేలు. క్రెడిట్‌ కార్డు స్టేట్‌మెంట్లనీ ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవడం మరచిపోవద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్