Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 16 Mar 2024 12:59 IST

1. కరీంనగర్‌లో భారీగా నగదు పట్టివేత

నగరంలోని ప్రతిమ మల్టీప్లెక్స్‌లో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో రూ.6.65 కోట్లు పట్టుబడ్డాయి. హోటల్, బార్ అండ్ రెస్టారంట్, సినిమా హాళ్లలో సోదాలు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి శనివారం ఉదయం వరకు తనిఖీలు కొనసాగాయి. పూర్తి కథనం

2. దిల్లీ మద్యం కేసులో.. కేజ్రీవాల్‌కు బెయిల్‌

మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) శనివారం కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసులో ఆయనకు బెయిల్‌ లభించింది. రూ.15000 బాండ్‌, రూ.లక్ష పూచీకత్తుతో న్యాయస్థానం దీన్ని మంజూరు చేసింది. అనంతరం న్యాయమూర్తి అనుమతితో కోర్టు నుంచి కేజ్రీవాల్‌ వెళ్లిపోయారు.పూర్తి కథనం

3. కవిత అరెస్టుకు నిరసనగా భారాస శ్రేణుల ఆందోళన

భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా తెలంగాణలో పలు చోట్ల పార్టీ నేతలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు రోడ్లపై బైఠాయించడంతో వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. కేంద్రం కుట్రపూరితంగా అరెస్టు చేయించిందని.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.పూర్తి కథనం

4. ఈడీ అరెస్టు చేస్తే రాష్ట్రంలో ధర్నాలు ఎందుకు?: మంత్రి కోమటిరెడ్డి

దిల్లీ మద్యం కేసుకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం సంబంధమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. కవితను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. ఇందుకు నిరసనగా ధర్నాలు చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టడం ఎందుకన్నారు. గతంలో చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నిరసనలు తెలిపితే అడ్డుకున్నారని గుర్తు చేశారుపూర్తి కథనం

5. ఎన్నికల బాండ్లపై ఏడుపెందుకు.. లెక్కలు చూడండి: విపక్షాలకు అమిత్ షా కౌంటర్‌

రాజకీయాల్లో నల్లధన ప్రభావాన్ని అరికట్టేందుకే ఎన్నికల బాండ్ల (Electoral Bonds) పథకాన్ని తీసుకొచ్చామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) వెల్లడించారు. దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము పూర్తిగా గౌరవిస్తామన్నారు. అయితే, దీన్ని రద్దు చేయడానికి బదులుగా మెరుగుపర్చే అవకాశమిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.పూర్తి కథనం

6. అనుమానాస్పద స్థితిలో కెనడాలో భారత సంతతి కుటుంబం మృతి

కెనడా(Canada)లో భారత సంతతికి చెందిన కుటుంబం (Indian-Origin Family) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఒంటారియో ప్రావిన్స్‌లోని వారి నివాసంలో మంటలు చెలరేగడంతో వారు చనిపోయారు. గతవారమే (మార్చి 7) ఈ ఘటన జరిగింది.పూర్తి కథనం

7. ఎన్నికల ఎఫెక్ట్‌.. భారత్‌-యూకే వాణిజ్య చర్చలకు బ్రేక్‌..!

భారత్‌, బ్రిటన్‌ (India-UK) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాని (Free Trade Agreement)కి సంబంధించి తాజాగా జరిగిన చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే ముగిశాయి. అయితే, ఈ ఒప్పందం ఇప్పుడప్పుడే ఖరారయ్యే అవకాశాలు కన్పించట్లేదు. ఎన్నికల (Elections) నేపథ్యంలో చర్చలకు తాత్కాలికంగా విరామమిచ్చినట్లు తెలుస్తోంది.పూర్తి కథనం

8. రోహిత్ ఛాంపియన్‌ లీడర్‌.. ముంబయి నిర్ణయం అతడికి షాకే: హర్భజన్‌ సింగ్

మరో ఆరు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (IPL) 17వ సీజన్‌ ప్రారంభం కానుంది. ముంబయి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ ఎలా ఆడతాడు? ఐదుసార్లు ఛాంపియన్‌ అయిన ఆ జట్టును కొత్త సారథి హార్దిక్ పాండ్య ఎలా నడిపిస్తాడు? అనేది ఇప్పుడు అందరిలోనూ చర్చ.పూర్తి కథనం

9. ఎన్నికల నియమావళి.. తొలి ‘కోడ్‌’ కూసింది అప్పుడే!

సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) నిర్వహణకు సిద్ధమైన ఎన్నికల సంఘం.. నేడు పోలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. ఈసీ (Election Commission) ప్రకటన వెంటనే దేశవ్యాప్తంగా ‘ఎన్నికల నియమావళి’ (Model Code of Conduct) అమల్లోకి వస్తుంది.పూర్తి కథనం

10. ఆటగాళ్ల పాస్‌పోర్టులను తీసుకుంటున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు.. రెండో ఫేజ్‌ వేదిక మార్పు తప్పదా?

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (IPL) 17వ సీజన్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 15 రోజుల షెడ్యూల్‌ను ఐపీఎల్‌ నిర్వాహకులు ప్రకటించారు. మార్చి 22 నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇవన్నీ భారత్‌లోనే జరగనున్నాయి.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు