Sridharbabu: ఏఐ సిటీకోసం హైదరాబాద్‌లో 200 ఎకరాలు: మంత్రి శ్రీధర్‌బాబు

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రాకతో సాఫ్ట్‌వేర్‌ రూపురేఖలు సమూలంగా మారాయని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.

Published : 04 Apr 2024 15:07 IST

హైదరాబాద్‌: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రాకతో సాఫ్ట్‌వేర్‌ రూపురేఖలు సమూలంగా మారాయని, భవిష్యత్‌లో ఈ రంగంలో అపారమైన అవకాశాలు ఉంటాయని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రస్తుతం దేశంలో సాఫ్ట్‌వేర్‌ రంగంలో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్‌ను మొదటి ర్యాంకుకు తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమని వివరించారు.

సైబర్‌ టవర్స్‌లో పీఎస్‌ఆర్‌ గ్లోబల్‌ డెలివరీ సెంటర్‌ టెక్‌ హబ్‌ను మంత్రి ప్రారంభించారు. జులైలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై సదస్సు నిర్వహిస్తామని, ఏఐ సిటీ కోసం 200 ఎకరాలు కేటాయించామని ప్రకటించారు. ఈ రంగంలో విస్తృత పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని చెప్పారు. సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమను రాష్ట్రమంతా విస్తరింపజేసేందుకు ఐటీ సంస్థలు సహకరించాలన్నారు. స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసి పరిశ్రమ అవసరాలు తీరుస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని