TTD: తితిదేలో ఒప్పంద ఉద్యోగుల క్రమద్ధీకరణ.. ధర్మకర్తల మండలి నిర్ణయం

తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకరెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తితిదేలో అర్హులైన ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని సమావేశంలో నిర్ణయించారు.

Published : 14 Nov 2023 12:59 IST

తిరుమల: తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకరెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తితిదేలో అర్హులైన ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని సమావేశంలో నిర్ణయించారు. అలిపిరి గోశాల వద్ద ఈనెల 23 నుంచి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహణ.. ఈ హోమానికి రుసుం రూ.1000గా నిర్ణయం తీసుకున్నారు. 

మరోవైపు తితిదే ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంపై సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. శాశ్వత ఉద్యోగులకు రూ.14వేలు, ఒప్పంద ఉద్యోగులకు రూ.6,850 ఇచ్చేందుకు సమావేశంలో ఆమోదం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు