upsc: సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

సివిల్‌ సర్వీసెస్‌-2022 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్స్‌ మెయిన్స్‌కు మొత్తం 13,090 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు యూపీఎస్సీ వెల్లడించింది

Updated : 22 Jun 2022 19:08 IST

దిల్లీ: అఖిల భారత సర్వీసుల్లోకి ఉద్యోగుల ఎంపిక కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌ 2022 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్స్‌ మెయిన్స్‌కు మొత్తం 13,090 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు యూపీఎస్సీ వెల్లడించింది. సెప్టెంబర్‌ 16 నుంచి 21 వరకు సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మంది మెయిన్స్‌కు ఎంపికైనట్టు సివిల్స్‌ శిక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈనెల 5న దేశ వ్యాప్తంగా సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్షను యూపీఎస్సీ నిర్వహించింది. తెలంగాణ నుంచి 26వేల మంది, ఏపీ నుంచి సుమారు 24వేల మంది ప్రిలిమ్స్‌కు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని