కొవిడ్‌తో ఆస్పత్రిలో చేరిన మనీశ్‌ సిసోడియా!

గత వారం కరోనా వైరస్‌ బారిన పడిన దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా బుధవారం వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. జ్వరం, శ్వాస సంబంధింత ఇబ్బందులతో ఆయన దిల్లీలోని లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ ఆస్పత్రిలో చేరినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి.

Published : 24 Sep 2020 00:51 IST

దిల్లీ: గత వారం కరోనా వైరస్‌ బారిన పడిన దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా బుధవారం వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. జ్వరం, శ్వాస సంబంధిత ఇబ్బందులతో ఆయన దిల్లీలోని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ ఆస్పత్రిలో చేరినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్‌ 14న మనీష్‌ కొవిడ్‌ బారిన పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన తన అధికారిక నివాసంలోనే క్వారంటైన్‌లో ఉన్నారు. కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్దారణ అయిన అనంతరం ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించిన మనీశ్‌.. తనకు చిన్నపాటి జ్వరం ఉందని.. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు తెలిపారు. ఇతరత్రా ఇబ్బందులు ఏం లేవని చెప్పారు. ప్రజల దీవెనలతో తప్పకుండా కొద్దిరోజుల్లో విధుల్లో చేరుతానని కూడా ట్వీట్‌లో వెల్లడించారు. కాగా గడిచిన 24 గంటల్లో దిల్లీలో 3వేలకు పైగా కేసులు నమోదు కాగా.. 37 మంది మరణించారు. ప్రస్తుతం దిల్లీలో 31వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దిల్లీలో కొవిడ్‌ కారణంగా 5వేల మంది మరణించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని