ప్లాస్మా దానానికి బెస్ట్‌ ఎవరంటే..!

కరోనా వైరస్‌ మహమ్మారి ఎదుర్కొనేందుకు కచ్చితమైన చికిత్స లేనప్పటికీ ప్లాస్మా థెరపీ వల్ల కొంత మెరుగైన ఫలితాలు ఉంటున్నట్లు కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే, ఎలాంటి వ్యక్తుల నుంచి సేకరించిన ప్లాస్మా ప్రయోజనకరంగా...........

Published : 21 Oct 2020 01:24 IST

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ మహమ్మారి ఎదుర్కొనేందుకు కచ్చితమైన చికిత్స లేనప్పటికీ ప్లాస్మా థెరపీ వల్ల కొంత మెరుగైన ఫలితాలు ఉంటున్నట్లు కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే, ఎలాంటి వ్యక్తుల నుంచి సేకరించిన ప్లాస్మా ప్రయోజనకరంగా ఉంటుందనే విషయంపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉండి, ఆసుప్రతిలో చికిత్స పొందిన వారి నుంచి సేకరించిన ప్లాస్మా వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటున్నట్లు తేలింది. వీరిలోనే వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు సమృద్ధిగా ఉండి, వ్యాధిపై పోరాడుతున్నట్లు తాజాగా మరో పరిశోధనలో తేలింది. అంతేకాకుండా వైరస్‌ బారినపడి కోలుకున్న వృద్ధులు, ముఖ్యంగా పురుషుల ప్లాస్మానే సమర్థంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు.

కొవిడ్‌ చికిత్సలో భాగంగా ప్రస్తుతం, ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్నవారి రక్తంలోని ప్లాస్మా ద్రవాన్ని జబ్బుతో బాధపడుతున్నవారికి ఎక్కించే 'కన్వల్సెంట్‌ ప్లాస్మా థెరపీ' ని వైద్యులు పాటిస్తున్నారు. ఈ సమయంలో ప్లాస్మా దానానికి ఎంతో మంది కోలుకున్నవారు ముందుకు వస్తున్నారు. అయితే, వైరస్‌ నుంచి కోలుకున్న ఎవరిలో యాంటీబాడీలు ఎక్కువగా ఉంటాయి..? ఎలాంటి వ్యక్తుల నుంచి ప్లాస్మా సేకరించాలి? అనే విషయంపై స్పష్టత కొరవడింది. ఈ సమయంలో అమెరికాలో జాన్స్‌ ‌హాప్కిన్స్‌ బ్లూమ్‌బర్గ్‌ స్కూల్‌ ఆరోగ్య నిపుణులు పరిశోధన చేపట్టారు. ప్లాస్మా సేకరించే సమయంలో లింగ బేధం, వయస్సు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. వైరస్‌ బారినపడి కోలుకున్న 126 మందిలో యాంటీబాడీలను విశ్లేషించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపారు. వీరిలో ఎక్కువ తీవ్రతతో ఆసుపత్రిలో చేరిన, వృద్ధ, పురుషుల్లోని యాంటీబాడీల ప్రతిస్పందనలు ధృడంగా ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. అయితే, భారత్‌లో మాత్రం ప్లాస్మా థెరపీ అశించిన ఫలితాలు ఇవ్వడం లేదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఈ మధ్యే స్పష్టంచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని