కరోనా నుంచి కోలుకున్న సిద్ధరామయ్య

కరోనా వైరస్‌ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య కోలుకున్నారు. రెండోసారి ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ అని రావడంతో డిశ్చార్జ్‌ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి....

Published : 13 Aug 2020 17:54 IST

బెంగళూరు: కరోనా వైరస్‌ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య కోలుకున్నారు. రెండోసారి ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ అని రావడంతో డిశ్చార్జ్‌ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆగస్టు 3 తేదీన కరోనా సోకడంతో ఆయన బెంగళూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వైద్యుల సూచన మేరకు మరో వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండనున్నారు. గత పది రోజులుగా తనకు వైద్య సేవలు అందించిన ఆస్పత్రి సిబ్బందికి, త్వరగా కోలుకోవాలని తన కోసం ప్రార్ధించిన పార్టీ కార్యకర్తలకు ఆయన ట్విటర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. కర్ణాటక ఆరోగ్య మంత్రి శ్రీరాములు కరోనా బారిన పడటంతో ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు. మరో వైపు రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతున్న దాఖలాలు లేవు. నిన్న ఒక్క రోజే 7,883 కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసలు సంఖ్య 1,96,494కి చేరింది. ఇందులో 1,12,633 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 3,510 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 80,343 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని