Lockdown: లాక్‌డౌన్‌లు వద్దే వద్దు: ఆస్ట్రేలియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు

కొవిడ్‌ కట్టడికి చేపడుతున్న లాక్‌డౌన్‌లను నిరసిస్తూ ఆస్ట్రేలియాలో శనివారం పెద్ద ఎత్తున ప్రజలు

Published : 22 Aug 2021 11:03 IST

 250 మంది అరెస్టు

సిడ్నీ: కొవిడ్‌ కట్టడికి చేపడుతున్న లాక్‌డౌన్‌లను నిరసిస్తూ ఆస్ట్రేలియాలో శనివారం పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో దాదాపు 250 మందిని అధికారులు అరెస్టు చేశారు. మెల్‌బోర్న్‌లో భారీగా చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకోవడంతో ఏడుగురు పోలీసు అధికారులు గాయపడ్డారు. సిడ్నీలో రెండు నెలలుగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా.. ఈ నెల ప్రారంభంలో మెల్‌బోర్న్‌తో పాటు ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలోనూ విధించారు. ఈ ఆంక్షలతో చాలామంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఎవరినైనా కలవడం వంటివి పరిమితమైపోయాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌లకు ముగింపు పలకాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు.. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఈ చర్యలు అవసరమని అధికారులు చెబుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని