ట్రంప్‌ కుమారుడికి కొవిడ్‌!

తన కుమారుడు కూడా ఇప్పుడు కరోనా నెగిటివ్‌ అని ప్రథమ మహిళ మెలానియా స్పష్టం చేశారు.

Published : 15 Oct 2020 10:43 IST

తగ్గిందిగా పాఠశాలలు తెరవొచ్చు: ట్రంప్‌

వాషింగ్టన్‌: అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమారుడు 14 ఏళ్ల బారన్‌ ట్రంప్‌కు కూడా కరోనా వైరస్‌ సోకింది. అయితే అతనికి ఏ విధమైన లక్షణాలు లేవని.. తల్లితండ్రులు ఇద్దరికీ కొవిడ్‌-19 రావటంతో బారన్‌కు కూడా కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దానితో ఈ విషయం వెల్లడైందని ప్రస్తుతం తను, తన కుమారుడు కూడా కరోనా నెగిటివ్‌ అని ప్రథమ మహిళ మెలానియా వెల్లడించారు. ఈ మేరకు విడుదల చేసిన ఓ ప్రకటనలో.. టీనేజ్‌లో ఉన్న బారన్‌ను కరోనా లక్షణాలు అంతగా బాధించలేదని ఆమె వివరించారు. ట్రంప్‌తో సహా తమ ముగ్గురికీ ఒకేసారి కొవిడ్‌ సోకటం ఒక రకంగా మంచిదయిందని.. దీని వల్ల తాము ఒకరి బాగోగులు మరొకరు చూసుకోగలిగామని మెలానియా వివరించారు.

తన కుమారుడు బారన్‌ ట్రంప్‌ ఆరోగ్యంగానే ఉన్నాడని అయోవా రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ట్రంప్‌ కూడా ప్రకటించారు. పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి అధికంగా ఉంటుందని.. వారు కరోనాతో సమర్థవంతంగా పోరాడగలరని ఆయన అభిప్రాయపడ్డారు. పాఠశాలలు తిరిగి ప్రారంభించాలనే తన వాదన సరైనది అనేందుకు బారన్‌ కుదుటపడటమే ఉదాహరణ అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆయన కుమారుడికి తగ్గిందని మిగిలిన వారు తమ పిల్లలను తరగతులకు పంపటం ఎంతవరకు సమంజసమని విమర్శలు వెలువడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని