సాగుచట్టాలపై వెనక్కి తగ్గని కేంద్రం!
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తున్న రైతు సంఘాల నేతలో కేంద్రం నేడు మరోసారి చర్చలు చేపట్టింది. దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ నేతృత్వంలో
దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తున్న రైతు సంఘాల నేతలతో కేంద్రం నేడు మరోసారి చర్చలు చేపట్టింది. దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ నేతృత్వంలో ఈ చర్చలు జరుగుతున్నాయి. అయితే రైతుల ప్రధాన డిమాండ్ అయిన చట్టాల రద్దు పట్ల కేంద్రం ఇప్పటికీ సుముఖంగా ఉన్నట్లు కన్పించట్లేదు. సాగు చట్టాలను ఉపసంహరించడం కుదరదని కేంద్రం అన్నదాతలకు మరోసారి స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఆందోళన విరమిస్తే కనీస మద్దతు ధర అంశాన్ని పరిశీలిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారంపై ప్రతిష్టంభన తొలుగుతుందో లేదో అన్న సందిగ్ధత నెలకొంది.
రైతులతో కలిసి మంత్రుల భోజనం
కేంద్రంతో చర్చలు జరిపిన ప్రతిసారి ప్రభుత్వ ఆతిథ్యానికి రైతులు నిరాకరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. సింఘు వద్ద ఏర్పాటు చేసిన లంగర్లో వండి తెచ్చిన ఆహారాన్నే రైతులు తిన్నారు. ఇప్పుడు కూడా అలాగే భోజనం తెచ్చుకోగా.. కేంద్ర మంత్రులు కూడా అదే ఆహారాన్ని తిన్నారు. భోజన విరామ సమయంలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్ రైతు సంఘాల ప్రతినిధులతో కలిసి వారి భోజనాన్ని రుచిచూశారు.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
2జీ స్పెక్ట్రమ్‌పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్‌కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్‌లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరతకుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
-
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
-
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
-
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత
-
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
-
జగనాసురుడి రాజ్యం.. ఐసీయూలో ఆరోగ్యశ్రీ