Ind - Aus Flights: విమాన సేవల పునరుద్ధరణ!

భారత్‌ నుంచి వచ్చే విమానాలపై తాత్కాలికంగా విధించిన నిషేధాన్ని ఈరోజు(మే 14) అర్ధరాత్రి నుంచి ఎత్తివేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ ప్రకటించారు. అర్ధరాత్రి నుంచి ఆస్ట్రేలియా ప్రభుత్వానికి......

Updated : 14 May 2021 12:10 IST

నేటి అర్ధరాత్రితో ముగియనున్న నిషేధం

కాన్‌బెర్రా: భారత్‌ నుంచి వచ్చే విమానాలపై తాత్కాలికంగా విధించిన నిషేధాన్ని ఈరోజు(మే 14) అర్ధరాత్రి నుంచి ఎత్తివేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ ప్రకటించారు. అర్ధరాత్రి నుంచి ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చెందిన వాణిజ్య విమాన సర్వీసులు యథావిధిగా నడుస్తాయని స్పష్టం చేశారు. అయితే, ఆ దేశ పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకొని సేవల ప్రతి సర్వీసు ప్రారంభానికి ముందు పటిష్ఠ తనిఖీ వ్యవస్థ ఉంటుందన్నారు. 

క్వారంటైన్‌ కేంద్రాలను దాటి ప్రజల్లోకి కరోనా వ్యాపించకుండా అడ్డుకునేందుకు ఈ నిషేధం సహకరించిందని మోరిసన్‌ తెలిపారు. తద్వారా మూడో వేవ్‌ రాకుండా నిలువరించగలిగామని అభిప్రాయపడ్డారు. మే 3న భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ప్రయాణాలపై నిషేధం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా చరిత్రలో తొలిసారి అక్కడి ప్రభుత్వం తమ దేశ పౌరులపై కఠిన నిబంధనలు విధించింది. భారత్‌ నుంచి తమ దేశానికి వచ్చే ఆస్ట్రేలియన్లపై తాత్కాలికంగా నిషేధం విధించింది. భారతదేశంలో 14 రోజుల పాటు ఉన్న ఆస్ట్రేలియా పౌరులు తమ దేశంలోకి అడుగు పెడితే కఠిన శిక్షలు అమలు చేస్తామని హెచ్చిరించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని