Covaxin: టీనేజర్లకు టీకా.. ఆరోగ్య సిబ్బందికిభారత్‌ బయోటెక్‌ కీలక సూచన

టీనేజర్లకు కొవిడ్ టీకాపై ఆరోగ్య సిబ్బందికి భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ కీలక విజ్ఞప్తి చేసింది. 15 నుంచి 18 ఏళ్ల .......

Published : 19 Jan 2022 01:20 IST

హైదరాబాద్‌: టీనేజర్లకు కొవిడ్ టీకాపై ఆరోగ్య సిబ్బందికి భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ కీలక విజ్ఞప్తి చేసింది. 15 నుంచి 18 ఏళ్ల వారికి ఆమోదం పొందని టీకాలు ఇస్తున్నట్టు తమకు సమాచారం వచ్చిందని తెలిపింది. ఆరోగ్య కార్యకర్తలంతా అప్రతమ్తంగా ఉండాలని సూచించింది. 15-18 ఏళ్ల వారికి కేవలం కొవాగ్జిన్‌ మాత్రమే ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఈ సందర్భంగా గుర్తుచేసింది. భారత్‌లో పిల్లల టీకాకు సంబంధించి కొవాగ్జిన్‌కే అనుమతి ఉందన్న విషయాన్ని స్పష్టంచేసింది. కరోనా వేళ సేవలందిస్తున్న ఆరోగ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది.

మరోవైపు, దేశ వ్యాప్తంగా టీనేజర్లకు టీకా పంపిణీ వేగంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా నిన్నటి వరకు 3.59కోట్ల మందికి తొలి డోసు పంపిణీ చేశారు. మన దేశంలో పిల్లలకు పంపిణీ చేసేందుకు భారత్‌ బయోటెక్‌ సంస్థ ఉత్పత్తి చేసిన కొవాగ్జిన్‌  టీకాకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని