Budget: బడ్జెట్‌పై అసంతృప్తి.. రంగంలోకి భాజపా ఎంపీలు!

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వివిధ వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో భాజపా సర్కార్‌ నష్టనివారణ చర్యలు చేపట్టింది. బడ్జెట్‌లో ఉన్న సానుకూల అంశాలను, ప్రయోజిత విషయాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. ఈ మేరకు భాజపా ఎంపీలు,

Published : 04 Feb 2022 02:01 IST

దిల్లీ: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వివిధ వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో భాజపా సర్కార్‌ నష్టనివారణ చర్యలు చేపట్టింది. బడ్జెట్‌లో ఉన్న సానుకూల అంశాలను, ప్రయోజిత విషయాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. ఈ మేరకు భాజపా ఎంపీలు, జాతీయ నాయకులను రంగంలోకి దింపుతోంది. 

ఎంపీలు తమ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ప్రజలకు బడ్జెట్‌లోని అంశాలను అర్థమయ్యేలా వివరించాలని భాజపా అధిష్ఠానం సూచించింది. దీంతో వారంతా ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారు. బడ్జెట్‌లో కీలక అంశాలను, దేశాభివృద్ధికి ప్రభుత్వం రచించిన ప్రణాళికలను ప్రజలకు వివరించనున్నారు. బడ్జెట్‌లోని ప్రధానమైన పథకాలపై ప్రజలతో చర్చించేందుకు 15 రోజులపాటు వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించాలని కూడా భాజపా భావిస్తోంది. అంతేకాదు, బడ్జెట్‌ను స్థానిక భాషల్లోకి తర్జుమా చేసి భాజపా అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చనుంది. సోషల్‌మీడియాలోనూ బడ్జెట్‌ ప్రతులను పోస్టు చేయనుంది.

కేంద్ర ప్రభుత్వం ఈ సారి బడ్జెట్‌లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. డిజిటల్‌ యూనివర్సిటీ, డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. అలాగే, రసాయన రహిత వ్యవసాయం దిశగా అడుగులు వేయనున్నట్లు వెల్లడించింది. భారత్‌ ఇప్పటికే స్వావలంబన దేశంగా మారిందని, ఈ బడ్జెట్‌ కేవలం ఆధునిక భారతావనిని నిర్మించడం కోసమేనంటూ ప్రధాని మోదీ బడ్జెట్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని