Akhilesh Yadav: అఖిలేశ్ యాదవ్‌కు తప్పిన ప్రమాదం
ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh)లో రోడ్డు ప్రమాదం జరిగింది. అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) కాన్వాయ్ వెనుక ఉన్న వాహనాలను ఓ కారు బలంగా ఢీ కొట్టింది.
లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) అధినేత అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav)కు ప్రమాదం తప్పింది. ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh)లోని హర్దోయ్ జిల్లాలో ఆయన కాన్వాయ్ వెనుక వస్తున్న వాహనాలను ఓ కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా.. దాదాపు 7 వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే, ఈ ప్రమాదంలో అఖిలేశ్ యాదవ్ కాన్వాయ్‌లోని వాహనాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అక్కడి పోలీసులు వెల్లడించారు.
విషయం తెలుసుకున్న అఖిలేశ్ కాన్వాయ్‌ను కొద్దిసేపు ఆ పారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించాల్సిందిగా అక్కడున్న వారిని ఆదేశించారు. అనంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ‘‘ఓ కారు అదుపుతప్పి.. అఖిలేశ్ యాదవ్ కాన్వాయ్ వెనక వస్తున్న వాహనాలను బలంగా ఢీ కొట్టింది. అయితే, ఈ ఘటనలో అఖిలేశ్ యాదవ్ కాన్వాయ్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు’’ అని హర్దోయ్ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూకు 100 కి.మీ దూరంలో చోటు చేసుకుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Andhra News: సత్తెనపల్లి టికెట్ కోసం యుద్ధానికైనా సిద్ధం: వైకాపా నేత చిట్టా
-
Politics News
KTR: సోషల్ మీడియా కమిటీలను మరింత బలోపేతం చేసుకోవాలి: పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం
-
Movies News
Balagam: ‘బలగం’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న గ్రామస్థులు
-
India News
Uttarakhand: లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి, 20మందికి గాయాలు..!
-
India News
Anurag Thakur: ‘రాహుల్ గాంధీ పది జన్మలెత్తినా.. సావర్కర్ కాలేరు’
-
Movies News
Rana: రానా.. చిన్నప్పటి ఇంటిని చూశారా..!