Punjab Elections: పంజాబ్‌ ఎన్నికల్లో పోటీచేయనున్న సింగర్‌ సిద్ధు

వచ్చే ఏడాది జరగబోయే పంజాబ్‌ శాసనసభ ఎన్నికల్లో ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేయనున్నారు.  శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన్ను పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ సన్నీ, పంజాబ్‌ రాష్ర్ట కాంగ్రెస్‌ చీఫ్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూ ఆహ్వానించారు.

Published : 03 Dec 2021 23:48 IST

కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలోకి

దిల్లీ: వచ్చే ఏడాది జరగబోయే పంజాబ్‌ శాసనసభ ఎన్నికల్లో ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేయనున్నారు.  శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన్ను పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ, పంజాబ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం చరణ్‌జిత్‌ మాట్లాడుతూ.. ‘‘ సిద్ధూ ఓ మాజీ ఆర్మీ అధికారి, రైతు బిడ్డ. కచ్చితంగా కాంగ్రెస్‌ను గర్వపడేలా చేస్తాడనే నమ్మకం మాకుంది. పార్టీ తరఫున ఆయన్ను స్వాగతిస్తున్నాం. ఆయనో ఛాంపియన్‌’’ అని కొనియాడారు. 28ఏళ్ల సిద్ధూ సొంతూరు పంజాబ్‌లోని మాన్సా నుంచి పోటీ చేస్తున్నారు. తుపాకీలు, గ్యాంగ్‌స్టర్లు...హింసను ప్రేరేపించేవి ఎక్కువగా పాటల్లో చూపించే వివాదస్పద గాయకుడిగా వార్తల్లో నిలిచారు సిద్ధు. కాగా 2020 జులై కొవిడ్‌ లాక్‌డౌన్‌ విధించినప్పుడు ఫైరింగ్‌ రేంజ్‌లో ఎకే-47 రైఫిల్‌ని ఉపయోగించినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. ఇక ఆయన పాడిన ‘బంబిహ బోలే’, ‘47’ పాట అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ‘తేరీ మేరీ జోడీ’, మోసా జఠ్‌..వంటి చిత్రాల్లోనూ నటించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని