Indian Ocean: హిందూ మహా సముద్రంలోకి భారీ ఎత్తున చైనా పడవలు..!

ఈ ఏడాది తొలి అర్ధ భాగంలోనే దాదాపు 200 చేపల వేట పడవలు చైనా నుంచి హిందూ మహా సముద్రంలోకి వచ్చాయని భారత నావికాదళం పేర్కొంది. ఈ నౌకలు చట్టవిరుద్ధమైనవని, ఎటువంటి సమాచారం ఇవ్వలేదని, రెగ్యులేటెడ్‌ కానివని వెల్లడించింది.

Published : 14 Nov 2022 11:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఏడాది తొలి అర్ధభాగంలోనే దాదాపు 200 చేపల వేట పడవలు చైనా నుంచి హిందూ మహా సముద్రంలోకి వచ్చాయని భారత నావికాదళం పేర్కొంది. ఈ నౌకలు చట్టవిరుద్ధమైనవని, ఎటువంటి సమాచారం ఇవ్వలేదని, రెగ్యులేటెడ్‌ కానివని వెల్లడించింది. భారత ఈఈజెడ్‌ (ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌) సమీపంలో ఇవి చేపల వేట కొనసాగిస్తున్నాయని పేర్కొంది. ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలోనే ఇవి అక్రమ కార్యకలాపాలను సాగిస్తున్నాయని చెప్పింది. ఓ ఆంగ్లపత్రిక అడిగిన సమాచారం కింద ఈ వివరాలను వెల్లడించింది. చైనా నౌకలతోపాటు ఐరోపా దేశాల నౌకలు కూడా కొన్ని ఇక్కడకు వచ్చి చేపల వేట చేపడుతున్నాయని పేర్కొంది.

ఇటీవల కాలంలో డీప్‌సీ ఫిషింగ్‌ ట్రాలెర్లు, ఇతర పడవల కారణంగా మొత్తంగా ఈ ప్రాంతంలో చైనా కదలికలు పెరిగాయి. చైనా తీరానికి దూరంగా ఇక్కడకు డీప్‌సీ ట్రాలెర్లు రావడం ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా సముద్ర గర్భం పరిస్థితులపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది.  2015 నుంచి 2019 మధ్య 500 చైనా డీప్‌సీ ట్రాలెర్లు ఇక్కడకు వచ్చాయి. ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో చేపల వేట నిర్వహిస్తున్న చైనా పడవల్లో మూడోవంతుకు ఎటువంటి గుర్తింపు లేనట్లు సమాచారం. వీటికి తోడు రెండు పరిశోధన నౌకలు కూడా హిందూ మహాసముద్రంలో ఉన్నాయి. క్షిపణులను ట్రాక్‌ చేయగల సామర్థ్యం వీటికి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని