సిమెంట్‌, స్టీల్‌కు ప్రత్యామ్నాయాలు అవసరం

దేశంలో సిమెంట్‌, స్టీల్‌ ధరలు తగ్గాలంటే వాటికి ప్రత్యామ్నాయాలు అవసరమని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అభిప్రాయపడ్డారు. వాటి ధరలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని యువతకు.......

Published : 25 Jan 2021 19:27 IST

దిల్లీ: దేశంలో సిమెంట్‌, స్టీల్‌ ధరలు తగ్గాలంటే వాటికి ప్రత్యామ్నాయాలు అవసరమని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అభిప్రాయపడ్డారు. వాటి ధరలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని యువతకు సూచించారు. ఈ మేరకు దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ విజ్ఞాన్‌ గ్రామ్‌ సంకుల్‌ పరియోజన పథకం కింద తయారైన ఉత్పత్తుల ఆవిష్కరణకు సంబంధించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

గత ఆరు నెలల్లో స్టీల్‌ ధరలు 65 శాతం మేర పెరిగాయని గడ్కరీ అన్నారు. సిమెంట్‌ ధరలు కూడా పెరుగుతున్నాయని చెప్పారు. వీటి ధరలు తగ్గాలంటే ప్రత్యామ్నాయాల కోసం పరిశోధనలు జరగాలని ఐఐటీల్లో చదువుకునే విద్యార్థులకు సూచించారు. మటన్‌కు ప్రత్యామ్నయంగా సోయాబీన్‌ కేకులను ఉపయోగించడాన్ని అందుకు ఉదాహరణగా చూపించారు. సోయాబీన్‌ కేకులను విరివిగా ఉపయోగిస్తే మటన్‌ ధరలు భారీగా తగ్గుతాయని,  అందులో ఉండే ప్రోటీన్ల మూలగా పోషకాహార సమస్యను కూడా నివారించొచ్చని అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి..
50 వేల ట్రాక్టర్లతో రైతన్నల ర్యాలీ! 
వాట్సాప్‌: ఐరోపాలో ఒకలా.. భారత్‌లో మరోలా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని