చక్రాలకుర్చీ అడిగితే.. జైల్లో పెట్టిస్తా

బెంగళూరు: ఓ ప్రయాణికురాలు, ఆమె తల్లి పట్ల ఇండిగోకు చెందిన పైలెట్‌ దురుసుగా ప్రవర్తించిన ఘటనపై కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌పూరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. చెన్నై నుంచి బెంగళూరు

Updated : 14 Jan 2020 20:26 IST

ప్రయాణికురాలికి ఇండిగో పైలట్‌ బెదిరింపులు

బెంగళూరు: ఓ ప్రయాణికురాలు, ఆమె తల్లి పట్ల ఇండిగోకు చెందిన పైలట్‌ దురుసుగా ప్రవర్తించిన ఘటనపై కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌పూరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. చెన్నై నుంచి బెంగళూరు వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

సుప్రియ ఉన్ని నాయర్‌ తన 75ఏళ్ల తల్లితో కలిసి ఇండిగో విమానం ఎక్కింది. తన తల్లి అనారోగ్య పరిస్థితుల కారణంగా విమానం నుంచి దిగే సమయంలో ఆమెకు చక్రాల కుర్చీ ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రియ విమాన సిబ్బందిని కోరింది. దీనిపై పైలట్‌ జయకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని సుప్రియ ట్విటర్‌లో పోస్టు చేయడంతో కేంద్రమంత్రి దృష్టికి వెళ్లింది. ‘బెంగళూరు విమానాశ్రయంలోకి తీసుకెళ్లేందుకు మా అమ్మకి చక్రాలకుర్చీ ఏర్పాటు చేయాల్సిందిగా కోరాను. కానీ అందుకు పైలట్‌ జయకృష్ణ నిరాకరించడంతో పాటు మమ్మల్ని వేధింపులకు గురిచేశాడు. చక్రాల కుర్చీ అడిగితే ఒకరోజంతా జైల్లో పెట్టిస్తానని మమ్మల్ని బెదిరించాడు. మా అమ్మ పరిస్థితి గురించి చెప్పినా వినిపించుకోకుండా అతను మాపట్ల దురుసుగా ప్రవర్తించాడు. నాగురించి ఏమనుకుంటున్నారు? మా సీఈవోతో చెప్పి మిమ్మల్ని ఒకరోజంతా జైల్లో పెట్టించగలను. మీరు నన్ను ఏమీ చేయలేరు. ఎలా ప్రవర్తించాలో మీకు నేను నేర్పిస్తాను’ అంటూ  గట్టిగా తమపై అరిచినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత విమానాశ్రయ సిబ్బంది చక్రాల కుర్చీ తీసుకొచ్చి వాళ్లను తీసుకెళ్లారని కానీ ఆ సమయంలో కూడా  గట్టిగట్టిగా అరుస్తూ విమానాశ్రయంలో తమను దుర్భాషలాడినట్లు ఆమె తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రి పూరి విచారణకు ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని