రైలు టికెట్ల బుకింగ్‌కు ఏజెంట్లు ఉండరిక

ప్రైవేటు విక్రేతలు, ఏజెంట్లు రైలు టికెట్లు బుక్‌ చేయకుండా నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. లోక్‌సభలో శుక్రవారం రైల్వేశాఖకు......

Published : 13 Mar 2020 19:06 IST

దిల్లీ: ప్రైవేటు విక్రేతలు, ఏజెంట్లు రైలు టికెట్లు బుక్‌ చేయకుండా నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. లోక్‌సభలో శుక్రవారం రైల్వేశాఖకు సంబంధించిన చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టికెట్లను పెద్ద ఎత్తున బుక్‌ చేసేందుకు వివిధ సాఫ్ట్‌వేర్లు ఉపయోగించి కొందరు వ్యక్తులు అక్రమాలకు పాల్పడుతున్నారని గోయల్‌ తెలిపారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటున్నామని,  వారిని అరెస్ట్‌ చేస్తున్నామని చెప్పారు. ఎక్కువ మంది ప్రజలు తమ మొబైళ్లలోనే టికెట్లు బుక్‌ చేసుకుంటే ప్రైవేటు ఏజెంట్ల అవసరం ఉండదని గోయల్‌ అన్నారు. ఎవరికైతే అలాంటి సేవలు అవసరమవుతాయో ప్రభుత్వం నడిపే సేవా కేంద్రాలను సంప్రదించొచ్చని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని