మహారాష్ట్రలో మరో నాలుగు కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో మరో నాలుగు కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరిలో ముగ్గురు ముంబయికి, మరొకరు నవీ ముంబయికి చెందినవారని తెలిపారు.........

Published : 16 Mar 2020 14:59 IST

ముంబయి: దేశంలో కరోనా వైరస్‌ క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో మరో నాలుగు కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరిలో ముగ్గురు ముంబయికి, మరొకరు నవీ ముంబయికి చెందినవారని తెలిపారు. దీంతో రాష్ట్రంలో వైరస్‌ బాధితుల సంఖ్య 37కు చేరింది. ఈ ఒక్కరోజే మహారాష్ట్రలో ఐదు కేసులు వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా వైరస్‌ సోకినవారి సంఖ్య 116కు చేరినట్లైంది. 

ఎలాంటి సమావేశాలు నిర్వహించొద్దు: కేజ్రీ

మరోవైపు దేశరాజధానిలో వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆంక్షల్ని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మరింత కట్టుదిట్టం చేశారు. మార్చి 31 వరకు 50 మందికంటే ఎక్కువ మంది హాజరయ్యే అవకాశం ఉన్న ఎలాంటి మత, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక సమావేశాలు నిర్వహించ కూడదని ఆదేశించారు. ఈ నెలాఖరు వరకు జిమ్ములు, నైట్‌క్లబ్‌లు, స్పాలు మూసివేయాలని కోరారు. పెళ్లిళ్లపై ఎలాంటి నిషేధం లేకపోయినప్పటికీ.. తేదీల్ని మార్చుకోవడం మంచిదని సూచించారు. అనుమానితుల్ని పర్యవేక్షణలో ఉంచేందుకు లెమన్‌ ట్రీ, రెడ్‌ ఫాక్స్‌, ఐబీఐఎస్‌ హోటళ్లలో క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో హ్యాండ్‌ శానిటైజర్లను ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మెట్రో స్టేషన్లలోనూ ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించడంపై పరిశీలిస్తామని తెలిపారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని