హలో హెల్ప్‌లైన్‌.. రసగుల్లాలు కావాలి

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు వింతైన అభ్యర్థనలు, డిమాండ్‌లు వస్తున్నాయి. కొందరు అత్యవసర వస్తువుల కోసం అభ్యర్థించగా.. మరికొందరు పాన్‌, రసగుల్లాలు, సమోసాలు, గుట్కా వంటివి కావాలని... 

Published : 18 Apr 2020 21:35 IST

లఖ్‌నవూ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు వింతైన అభ్యర్థనలు, డిమాండ్‌లు వస్తున్నాయి. కొందరు అత్యవసర వస్తువుల కోసం అభ్యర్థించగా.. మరికొందరు పాన్‌, రసగుల్లాలు, సమోసాలు, గుట్కా వంటివి కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. నిత్యావసరాలు కావాలంటూ ఫోన్‌ చేసిన వారికి వెంటనే అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. యూపీలోని హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసిన లఖ్‌నవూకు చెందిన ఓ వృద్ధుడు రసగుల్లాలు కావాలని కోరాడు. ఆటపట్టించడానికి అలా అడిగి ఉంటాడని మొదట పోలీసులు భావించినప్పటికీ వాలంటీర్‌తో ఆయనకు స్వీట్లు పంపించారు. 80 ఏళ్లు పైబడిన ఆ వృద్ధుడికి రక్తంలో చక్కర నిల్వలు నిజంగానే తగ్గాయని.. కాబట్టే రసగుల్లాలు కోరాడని వాలంటీర్‌ తెలిపారు. పిజ్జాలు, మద్యం కోసం హెల్స్‌లైన్‌కు ఫోన్‌ చేసే కొందరిపై యూపీ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని