రైల్వే రిజర్వేషన్లు ప్రారంభం..!

దేశవ్యాప్తంగా జూన్‌1 నుంచి రైలు సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ప్రతిరోజు 200రైళ్లను వివిధ మార్గాల్లో నడపాలని నిర్ణయించింది. వీటికి సంబంధించిన ముందస్తు రిజర్వేషన్లను ఈరోజు ప్రారంభమయ్యాయి.

Updated : 21 May 2020 10:58 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా జూన్‌1 నుంచి రైలు సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ప్రతిరోజు 200రైళ్లను వివిధ మార్గాల్లో నడపాలని నిర్ణయించింది. వీటికి సంబంధించిన ముందస్తు రిజర్వేషన్ల ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. ఉదయం 10గంటలకే స్లీపర్‌ క్లాస్‌ రిజర్వేషన్లకు అనుమతి ఇవ్వడంతో కొద్దిసేపటికే వెయిటింగ్‌ లిస్టుకు చేరిపోయాయి. కేటాయించిన టికెట్లు పూర్తయిన తర్వాత 200వరకు వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం జూన్‌ 1 నుంచి 22వ తేదీ వరకు మాత్రమే రిజర్వేషన్‌ చేసుకోవడానికి రైల్వే శాఖ అనుమతించింది. లాక్‌డౌన్‌ కాలంలో నడిపిన ప్రత్యేక రైళ్లలో కేవలం ఏసీ బోగీలనే అనుమతించిన రైల్వే అధికారులు ప్రస్తుతం స్లీపర్‌ బోగీల్లో రిజర్వేషన్లకు అనుమతించారు. రైళ్ల సమయాలు, ఆగే స్టాపులూ గతంలోలాగే ఉంటాయని అధికారులు వెల్లడించారు.

రోజూ నడిచే రైళ్లు: ముంబయి-హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (02701/02), హావ్‌డా- సికింద్రాబాద్‌ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ (02703/04), హైదరాబాద్‌- న్యూదిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ (02723/24), దానాపూర్‌- సికింద్రాబాద్‌ దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (02791/92), విశాఖపట్నం- దిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ (02805/06), గుంటూరు- సికింద్రాబాద్‌ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ (07201/02) , తిరుపతి- నిజామాబాద్‌ రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ (02793/94), హైదరాబాద్‌- విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (02727/28).

దురంతో రైళ్లు: సికింద్రాబాద్‌- హజ్రత్‌ నిజాముద్దీన్‌ (02285/86) (వారానికి రెండుసార్లు)

సాధారణ తరగతి సీట్లకూ రిజర్వేషనే
ప్రత్యేక రైళ్లలో సాధారణ తరగతి పెట్టెల్లోని సీట్లకు కూడా రిజర్వేషన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. సీట్ల రిజర్వేషన్‌ ఉండే జనరల్‌ కోచ్‌లకు ద్వితీయ తరగతి సీటింగ్‌ రుసుములు వసూలు చేస్తారు.

* మొత్తంమీద ఈ రైళ్లలో రిజర్వేషన్‌ లేని పెట్టెలంటూ ఏవీ ఉండవు.

* అన్ని టికెట్లనూ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌/ యాప్‌ ద్వారానే తీసుకోవాలి. రిజర్వేషన్‌ కౌంటర్లు, రైల్వే స్టేషన్లలో టికెట్లు తీసుకునే అవకాశం ఉండదు. రైల్లోనూ ఎవరికీ టికెట్లు ఇవ్వరు.

* 30 రోజుల ముందుగా టికెట్లు తీసుకోవచ్చు.

* ఆర్‌ఏసీ, వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లను కూడా నిబంధనల ప్రకారం జారీ చేస్తారు.

* తత్కాల్‌, ప్రీమియం తత్కాల్‌ టికెట్లు ఉండవు.

సికింద్రాబాద్‌, విజయవాడ మీదుగా

* హావ్‌డా-యశ్వంత్‌పూర్‌ (వయా విజయవాడ) దురంతో ఎక్స్‌ప్రెస్‌ (02245/46).. వారానికి ఐదు రోజులు

* ముంబయి సీఎస్‌టీ- భువనేశ్వర్‌ (వయా సికింద్రాబాద్‌, విజయవాడ) కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ (01019/20).. ప్రతిరోజు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని